సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి.

On
సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి.

 

-రాష్ట్ర కార్యదర్శి 
వర్గ సభ్యులు జి నాగయ్య

 నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ప్రజా సమస్యల  పరిష్కారం కోసం పనిచేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో.గెలిపించాలనిసిపిఎం
 రాష్ట్ర కార్యదర్శులుగా సభ్యులు జినాగయ్య పిలుపునిచ్చారు.
బుధవారం మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలో జరిగిన సిపిఎం విస్తృతస్థాయి సమావేశానికి జిల్లా కార్యదర్శి  సాదుల శ్రీనివాస్ తో కలిసి నాగయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ శాఖ కార్యదర్శి ఎస్ కె షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండెపూడి గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని నాగయ్య మండిపడ్డారు. గత 30 సంవత్సరాల క్రితం గ్రామం ఎలా ఉందో ఈరోజు అలానే ఉందని, ఈ గ్రామాన్ని అనేక దపాలుగా  కాంగ్రెస్ , తెలుగుదేశం, బిఆర్ఎస్ పార్టీల సర్పంచులను గెలిపించినప్పటికీ గ్రామ అభివృద్ధి ఎక్కడి వేసిన గొంగడి అక్కడనే ఉందన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయకపోగా గ్రామంలో  గత సంవత్సరం ఏకగ్రీవంగా సర్పంచిగా గెలిచిన ఆయన ఏమి అభివృద్ధి చేశారని  నిలదీశారు. గత ప్రభుత్వాలలో జరిగిన అవినీతి వ్యతిరేకంగా పోరాడి  జైలుకుపోయిన సంఘటనలు, అమరజీవి బయో వెంకన్న ప్రభుత్వ విధానాలపై నిరంతరం గ్రామ ప్రజలను చైతన్యం చేసేవారు అని గుర్తు చేశారు. కార్మికుల సమస్యలు, అంగన్వాడి,గీతా , గొర్రెల మేకలు, హమాలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, విద్యార్థి, యువజన గిరిజన, మహిళా హక్కుల కోసం, కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల ఐక్యత కోసం నిరంతరంగా పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే ఎర్రజెండా సిపిఎం ఒకటేనని స్పష్టం చేశారు. నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎం నుండి పోటీ చేస్తున్న సర్పంచ్ వార్డ్ మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

పూటకొక్క పార్టీలు మార్చే నాయకులను ఓడించండి 

-సిపిఎంజిల్లా కార్యదర్శి 
 సాదుల శ్రీనివాస్

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఎన్నికలు అనగానే వచ్చే నిలబడి గెలిచిన తర్వాత వారు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని ఇలా పూటకొక్క పార్టీలు మార్చే నాయకులను ప్రజలు ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణ త్యాగాల కోసం వెనకాడకుండా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం ను ఆదరించాలన్నారు .మండలంలోని గుండెపూడి ఎల్లంపేట, రాంపురం, తాళ్ల ఊకల్, అబ్బాయిపాలెం, బావోజిగూడెం గ్రామాల నుండి కొన్ని దుక్కుల సర్పంచిగా, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారికి ప్రజలు ఓట్లు వేయాలని,  ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య, మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, మండల నాయకులు బాణాల రాజన్న, బోడపట్ల రాజశేఖర్, కందాల రమేష్, అల్లి శ్రీనివాస్ రెడ్డి, వడ్లకొండ ఉప్పలయ్య, బయ్య సురేష్ ఇక తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise