కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి
:- (సిఐటియు)
పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ, కార్యదర్శి పద్మజ సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముందు 12న జరిగే అంగన్వాడీ ధర్నా జరుగుతున్నట్లు పత్తికొండ సి డి పి ఓ. లలితకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆలిండియా మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి సమస్యలపై ఈనెల 12వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వించే అంగన్వాడిల ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు టీచర్ మరియు ఆయా తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకో గలమని అంతులేని యాపుల ద్వారా అంగన్వాడీలు సతమతం అవుతున్నారని అంతేకాకుండా అంగన్వాడి సెంటర్లకు అధికారులే కాకుండా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా విజిట్ చేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వం ఎక్కించిన యాపులు పనిచేయడానికే సరిపోతుందని అంగన్వాడీ సెంటర్లలో పూర్తిస్థాయిగా పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామని దీన్ని ప్రభుత్వం గమనించాలని వారు తెలియజేశారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరిగే విశాఖపట్నంలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని వారు. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు గోపాల్ దూదే కొండ లక్ష్మి సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.
