ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

On
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

845c4785-e746-457f-86a2-f5521add8ad8


నర్సంపేట డిసెంబర్ 5 ( నమస్తే భారత్   )  :  


 హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో నర్సంపేట పరిధిలోని బంజారా భవన్ వద్ద ఏర్పాటు చేసిన  హెలీపాడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేరుకోగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, అనసూయ సీతక్క,  నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ప్రభుత్వ విప్ రామ చంద్రునాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం డి రియాజ్, ఎం పి బలరాం నాయక్, ఎమ్మెల్సీ లు బస్వరాజు సారయ్య , పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, డాక్టర్ మురళి నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర 
సత్యనారాయణ,  తదితరులు పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాలతో సత్కరించారు. 
 హెలిపాడ్ వద్ద నుండి నర్సంపేటలోని వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు, ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరారు. 

రూ 508 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన


నర్సంపేట నియోజకవర్గంలో 
సుమారు రూ.508 కోట్ల 84 లక్షల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన శంకుస్థాపన చేశారు. 56.40 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి నెక్కొండ హెచ్ఎఎం రోడ్డు 2ఎల్ +పీఎస్ / 4ఎల్ లైన్ల రహదారికు
రూ. 82.56 కోట్లతో హనుమకొండ -నర్సంపేట- మహబూబాబాద్ హెచ్ఎఎం రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుకు నర్సంపేటలో రూ. 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు,
రూ.130.00 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల మరియు వసతి గృహముల నిర్మాణ పనులకు, రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు, నర్సంపేట పట్టణంలో రూ. 20.కోట్లతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు,
రూ.17.28 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి పాకాల హెచ్ఏఎం రోడ్డు 2ఎల్ +పీఎస్ లైన్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో  రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, అనసూయ సీతక్క,  ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,
 ప్రభుత్వ విప్ రామ చంద్రునాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం డి రియాజ్, ఎం పి బలరాం నాయక్, ఎమ్మెల్సీ లు బస్వరాజు సారయ్య , పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, డాక్టర్ మురళి నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర 
సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి
  :- (సిఐటియు)  పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి
తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న
వెంకటాపురంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు 
అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?
గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

Advertise