వెంకటాపురంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
On
నమస్తే భారత్ :-తొర్రూరు
మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు వంగ సమ్మన్న,బానోత్ హేమ్లా,సోమ్లా, బానోత్ రవిలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మొగుళ్ళ లింగన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోనే అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దరావత్ విజయ-రవి,గ్రామ నాయకులు, గ్రామ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
05 Dec 2025 19:46:04
:- (సిఐటియు)
పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి
