బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
పల్లె, పట్టణ ప్రగతికి కేసీఆర్ పాలన లోనే శ్రీకారం
మాజీ ఓడీసీఎంఎస్ కుడితి మహేందర్ రెడ్డి
నమస్తే భారత్:-మరిపెడ
పల్లె పట్టణ ప్రగతి సీఎం కేసీఆర్ ప్రభుత్వ సారధ్యంలోనే ఏర్పడిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఉమ్మడి వరంగల్ మాజీ ఓడీసీ ఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వీరారం, చిల్లంచర్ల, నాగరం తదితర గ్రామాల్లో ఆయన బీ ఆర్ ఎస్, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీ ఎస్ రెడ్యా నాయక్ తోడ్పాటు తో సర్పంచ్, వార్డు సభ్యులుగా నిలిచిన అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. పల్లె, పట్టణ ప్రగతికి అప్పటి సీఎం కేసీఆర్ చేసిన కృషి ప్రజలు గుర్తు ఉంచుకోవాలి అన్నారు. గ్రామాల్లో వైకుంఠ ధామాలు, హరిత హారం, నర్సరీ ల ఏర్పాటు సురక్షితమైన తాగునీటి సరఫర తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథం లో నిలిపిన ఘనత బీ ఆర్ ఎస్ పార్టీకి దక్కిందన్నారు. గ్రామాల్లో అనునిత్యం అందుబాటు లో ఉండే బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ గాదె అశోక్ రెడ్డి, పిట్టల ధనుంజయ, లక్మి నరసింహ లచ్చి నర్సు తదితరులు పాల్గొన్నారు.
