సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలి

On
సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలి

 

నమస్తే భారత్ :-తొర్రూరు

సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలని లయన్స్ క్లబ్ జిఎల్ టి కోఆర్డినేటర్ డాక్టర్ వేలూరు శారద  అన్నారు.సేవా తరుణి అధ్యక్షురాలు తుమ్మూరు శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం లయన్స్ క్లబ్ జోన్ చైర్ పర్సన్ వజినపల్లి దీప,అనిల్ కుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా  దంపతుల సహకారంతో డివిజన్ కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 130 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, స్కేలు పంపిణీ చేశారు.కస్తూర్బా పాఠశాలలో  సాంస్కృతిక నృత్య ప్రదర్శన పొందుతున్న ఆరుగురు విద్యార్థినీలకు రూ. 6 వేల విలువగల పట్టు చీరలను పంపిణీ చేశారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి తో కలిసి అన్న ప్రసాద వితరణ చేపట్టారు.లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థినీల ఆరోగ్య పరీక్షల కోసం రూ.5 వేల విలువగల పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ సేవా తరుణి ఆధ్వర్యంలో అద్భుతమైన సేవలను అధ్యక్షురాలు తుమ్మూరు శ్రీదేవిరెడ్డి నేతృత్వంలో కార్యవర్గ ప్రతినిధులంతా నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. 
 వివాహ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం.ప్రశంసనీయమన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సేవాతరుని ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని, దానికి స్థానికులు.చేయూతనందిస్తున్నారని తెలిపారు. ప్రజా సేవ చేసే వారికి స్థానికులు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ దామెర సరేష్, క్యాబినెట్ నెంబర్ డాక్టర్ నాగవాణి, కోశాధికారి వేముల మంజుల, ప్రతినిధులు తల్లాడ హీరదర్, బిజ్జాల సోమయ్య,రేవూరి శ్రీనివాస్, ధరావత్ విమల,రేణుక దేవి,చలువాది.సత్యనారాయణ,అనుపమ వంశీ ఉమారెడ్డి,వినయ్, మౌనిక, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise