సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి
On
నమస్తే భారత్ :-తొర్రూరు
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేతనందించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షుడు డాక్టర్ సూర్నం రామ నరసయ్య అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల రవీంద్రనాథ్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ లో అన్న ప్రసాద వితరణ, ప్రోటీన్స్ పౌడర్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రామ నర్సయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూల్ గ్యాట్ డాక్టర్ పి.కిరణ్ కుమార్, డాక్టర్ నందనా దేవి, డాక్టర్ మీరాజ్,క్లబ్ సెక్రటరీ మూడుపు రవీందర్ రెడ్డి, ట్రెజరర్ వజీనపల్లి శ్రీనివాస్,జాయింట్ సెక్రెటరీ బోనగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
