ఈదులకుంట తండా సర్పంచ్ అభ్యర్థిగా రజిని నామినేషన్
On
నమస్తే భారత్ :-తొర్రూరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండవ విడత నామినేషన్ల సందర్భంగా మండలంలోని ఈదులకుంట తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బానోత్ రజిని వెంకన్న మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం రజిని మాట్లాడుతూ టిపిసిసి ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
