మత్స్య కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం

On
మత్స్య కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం

 

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

మత్స్యకారులకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.తొర్రూరు మండలంలోని అమ్మాపురం పెద్ద చెరువులో మత్స్యశాఖ 100 రాయితీతో ఉచిత చేప పిల్లలను మంగళవారం టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు,అన్ని కుల వృత్తుల అభివృద్ధికి సీఎం రేవంత్ రేడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలోని చెరువులలో చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,చేపల ఉత్పత్తి గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముదిరాజులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ మాట్లాడుతూ జిల్లాలో 350 చెరువులు 72 సొసైటీలు,4099 మంది సభ్యులు ఉన్నారని అన్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు కుంటలు మత్తడిపడి, తెగిపోవడం వల్ల మత్స్య కార్మికులకు నష్టం జరిగిందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు.అమ్మాపురం చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని నిధులు కేటాయించి కట్ట నిర్మించాలని కోరారు. నిరుపేద మత్స్యకారులకు 15 డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, ముదిరాజుల గుడి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి జనగాం శివప్రసాద్,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ముత్తినేని.సోమేశ్వరరావు,ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి, కంచర్ల వెంకటాచారి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు మహబూబ్ రెడ్డి, ముద్దం విక్రం రెడ్డి, జూలూరు జగన్,అరవింద్, ముదిరాజ్ జిల్లా డైరెక్టర్లు ధనుంజయ్, నాగరాజు,నాయకులు ఉపేందర్,రమేష్.బ్రహ్మయ్య,బిక్షం,సాయిలు రాజు బాలయ్య, వీరేష్ నారాయణ, మత్స్యశాఖ అధికారులు శ్రీనివాస్, విష్ణు, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
హైదరాబాద్, నవంబర్ 26: పాతబస్తీ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ అగ్నిప్రమాద ఘటనలో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతి చెందాడు. ఈ ఘటనలో 80 శాతం కాలిన...
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం.
సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ  పోలీస్ స్టేషన్ ను  సందర్శించిన 
మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 
ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన
మత్స్య కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చూడాలి

Advertise