పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వరంలా మారాయి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,
నమస్తే భరత్, రాజేంద్రనగర్, నవంబర్ 13, పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఒక వరంలా మారాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మండల తాసిల్దార్ కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు 631 మంది కి 6 కోట్ల 31 లక్షల 73 వేల 196 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఒక వరంలా మారాయి అన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సిబ్బంది కార్పొరేటర్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
