అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉదాసీనత వైఖరి
పుట్టగొడుగుల్లా నిర్మాణాలు అయినా పట్టించుకోరు
ఫిర్యాదులు సైతం బుట్ట దాఖలు చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం
అనుమతి లేని అక్రమ నిర్మాణాలపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 05, అనుమతి లేని అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక మండల పరిధిలో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అధికారుల ఉదాసీనత వైఖరిమిటో అర్థం కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జీవో 111 నిబంధనలకు ఉన్నప్పటికీ అధికారుల ఆదేశాలని బేకాతర చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా బౌహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని పలు పర్యాయాలు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారుల స్పందన లేదని స్థానికులు మండిపడుతున్నారు. అటు పొరపాలిక టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరించడంలో మతలబేమిటో అర్థం కావడం లేదంటున్నారు. గతంలోని మధురానగర్ ఆర్బీనగర్ ప్రాంతాల్లో 84 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారని కానీ వాటి విషయంపై ఎలాంటి చర్యలు చేపట్టడాలు లేదని, ఇప్పుడు ప్రస్తుతం పుట్టగొడుగుల్లా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం దారుణం అన్నారు. నిర్మాణదారుడు నిబంధనలను తుంగలో తొక్కి అధికారుల ఆదేశాలను సైతం బేఖాతర చేస్తూ నిర్మాణాలు చేస్తూ పోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరినిర్మాణదారులు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అని అధికారులు ప్రజాప్రతినిధులు మా బంధువులని ఈ జీవోలు ఈ నిబంధనలు జాంతానై అనే ధోరణి లో వ్యవహరిస్తున్నారని పురపాలక అధికారులు కనీసం అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోగా కనీసం నోటీసులు కూడా ఇవ్వడం లేదని, గతంలో కొన్ని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి రెండు రోజులు కూడా కాకముందే నోటీసుల అందుకున్న నిర్మాణదారుడు యతివేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. ఇటీవల పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెల్లార్లు తవ్వుతూ నిరాటంకంగా నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు కనీసం కన్నెత్తైనా చూడకపోవడం ఇంతవరకు సమంజసమని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పొరపాలక అధికారులు దృష్టి సారించి తక్షణమే అక్రమ నిర్మాణాలపై అక్రమ నిర్మాణాలు చేస్తున్న నిర్మాణదారులపై వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
