తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

On
తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

 

రైతులను, కూలీలను ఆదుకోవాలి  సిపిఎం మండల కార్యదర్శి జి శ్రీరాములు, రంగరాజు

 తుగ్గలి25(నమస్తే భారత్):
 తుగ్గలి లోని ఎంపీడీవో ఆఫీస్ నందు సర్వసభ సమావేశం జరుగుతున్న సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఎంపీడీవో విశ్వ మోహన్ గారికి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు,ఖరీఫ్ లో అతివృష్టి,అనావృష్టి వల్ల తుగ్గలి మండల వ్యాప్తంగా వివిధ పంటలు సాగుచేసిన రైతంగం పూర్తిగా నష్టపోవడం జరిగిందని. ఈ రైతన్న ఆదుకునేందుకు తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ మంగళవారం సిపిఎం నాయకులు స్థానిక  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విశ్వమోహన్ కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం  మండల కన్వీనర్ జి, శ్రీరాములు మాట్లాడుతూ, ప్రభుత్వం  పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా అదనపు పని దినాలు కలిపించాలని సిపిఎం  మండల కన్వీనర్ జి, శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ లో  సాగు చేసిన పంటలు వేరుశనగ, పత్తి, కంది, ఆముదం ఇతర పంటలు 
 ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు ఎక్కువ కురవడం వల్ల పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం స్పందించి  తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి, నష్టపరిహారం వెంటనే విడుదల చేసి తుగ్గలి మండల రైతాంగాన్ని ఆదుకోవాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ ద్వారా అదనపు పని దినాలు కల్పించి 600 రూపాయలకు తక్కువ కాకుండా వేతనం అమలయ్యేటట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ జి శ్రీరాములు సిపిఎం నాయకులు రంగరాజు, 
సీనియర్ నాయకులు 
 తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
హైదరాబాద్, నవంబర్ 26: పాతబస్తీ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ అగ్నిప్రమాద ఘటనలో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతి చెందాడు. ఈ ఘటనలో 80 శాతం కాలిన...
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం.
సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ  పోలీస్ స్టేషన్ ను  సందర్శించిన 
మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 
ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన
మత్స్య కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చూడాలి

Advertise