విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చూడాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు అందేలా ఆయా పాఠశాలల హెచ్ఎం లు చొరవ చూపాలని ఏ డి ఏ, మండల ప్రత్యేక అధికారి విజయ్ చంద్ర పేర్కొన్నారు.ఎస్సీ అభివృద్ధి విభాగం, బీసీ సంక్షేమ విభాగం ల ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలపై మంగళవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పాయ పాఠశాలల హెచ్ఎం లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య లతో కలిసి ప్రత్యేక అధికారి విజయ్ చంద్ర మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఐదవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలు ఉపకార వేతనాలు అందిస్తున్నాయని తెలిపారు.ఎస్సీ సంక్షేమ శాఖ ఐదు నుండి 8 తరగతిల విద్యార్థులకు బాలురకు ఏటా రూ.1000, బాలికలకు రూ.1500, 9, 10వ తరగతిల విద్యార్థులకు డేస్ స్కాలర్లకు రూ.3500, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు రూ.7 వేల ఉపకార వేతనం అందిస్తుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ నుండి 9 , 10 వ తరగతి విద్యార్థులకు రూ.4 వేల ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. హెచ్ఎంలు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మీసేవ కేంద్రాల్లో ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
పేద బిడ్డలను విద్యాపరంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీటీ నరసయ్య, సూపరిటెండెంట్ రాజేశ్వరి, వార్డెన్లు మధురిమ,ఎస్.కల్పన, సదానందం,శ్రీనివాస్,ఆయా పాఠశాలల హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
