మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్,నవంబర్ 25( నమస్తే భారత్ ప్రతినిధి): మహిళా ఆర్థిక అభివృద్దే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు.మంగళవారం
పాపన్నపేట మండలం పొడిచన్ పల్లి
రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు,గ్యాస్ సబ్సిడీ,సన్న బియ్యం,ఉచిత కరెంటు,వడ్డీ లేని రుణాలు ,ఇందిరా మహిళ శక్తి చీరలు,తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నదని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈవడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఒక ధైర్యం,నమ్మకం,ఆత్మ విశ్వాసం ఏర్పడిందని అన్నారు.
మహిళలు ఒకేపనికి పరిమితం కాకుండా,అని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల పేరు మీదనే కల్యాణ లక్ష్మి,ఇందిర మహిళా శక్తి చీరల వంటి పథకాలు అందిస్తుందన్నదని తెలిపారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు వడ్డీ లేని రుణాల రాయితీ కింద రూ.30 కోట్ల 50 లక్షలు
చెక్కును అందించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా 11 వేల మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.8.89 కోట్లు వడ్డీరాయితీ
అందించామన్నారు.మహాలక్ష్మి పథకం కింద 4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయగా రూ.100 కోట్ల రూపాయలు మహిళలు లబ్ధి పొందడం జరిగిందన్నారు. అలాగే గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సౌకర్యం పై రూ.28 కోట్ల 65 లక్షల రూపాయలు లబ్ధిదారుల జీరో అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎంపీడీవో విష్ణువర్ధన్,ఎంపీఓ శ్రీశైలం,వెలుగు ఏపీఎం పల్లెరాజు, పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్,డిసిసి అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంత్ అప్ప,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్,మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ.గౌస్ పాషా, నాయకులు ఎల్.నరేందర్ గౌడ్,తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
