విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
ప్యాపిలి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
డోన్(నమస్తే భరత్):డోన్
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి డోన్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ప్యాపిలి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు గురించి, ఆ కళాశాల ద్వారా స్థానిక విద్యార్థులకు లభించే ప్రయోజనాలు,విద్యా సౌకర్యాల విస్తరణపై వివరాలు మంత్రి కి తెలియజేశారు. అదే విధంగా డోన్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం అత్యవసరత,ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, భవిష్యత్ పట్టణాభివృద్ధికి గురించి కూడా ప్రత్యేకంగా చర్చించారు.ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలన్నింటినీ మంత్రి నారా లోకేష్ శ్రద్ధగా విని, ప్రభుత్వ స్థాయిలో వీటి పై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
