కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి.
ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు.
నమస్తే భారత్ :-కురవి
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కురవి మండల కమిటీ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కురవి మండల 5వ మహాసభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ.. స్వాతంత్రం- ప్రజాస్వామ్యం -సోషలిజం లక్ష్యాలతో ఈరోజు దేశవ్యాప్తంగా నాణ్యమైన శాస్త్రీయమైన విద్యా విధానం అమలు చేయాలని అదేవిధంగా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు దేశవ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అధ్యయనం పోరాటం నినాదంతో దేశవ్యాప్తంగా పోరాడుతుంది అని మాట్లాడారు. దేశంలోనికి అనేక విద్యార్థి సంఘాలు ఉన్నా ఎస్ఎఫ్ఐ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది అని కొనియాడారు..దేశంలోని మోడీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు తీసుకొస్తూ.. పేద విద్యార్థులు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు చదువును దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఎన్సీఆర్టీలో పాఠ్యపుస్తకాలలో దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధులను తీసేస్తూ దేశ వ్యతిరేకుల్ని పాఠ్యపుషకలలో చేరుస్తుంది మతం రంగు నింపేస్తుంది.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నది. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు జన్+ జనరేషన్ యువత మొత్తం రోడ్డుమీదకు వచ్చి బ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థను, అవినీతిపరులను ఏరిపారేస్తూ.. ఒక నూతన తరానికి ముందడుగు వేస్తున్నారు.. వారి యొక్క స్ఫూర్తితో నేడు మన దేశంలో కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో రాజకీయం చేస్తున్న నాయకులను, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను ఏరిపారేస్తూ భవిష్యత్తు ఉద్యమాలకు ఊపిరి పోయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నూతన మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వీరేందర్ నూతన మండల ఉపాధ్యక్షులు జక్కుల గణేష్, గర్ల్స్ మండల నాయకులు మైత్రి, ప్రజ్ఞ, కళ్యాణి, ఉజ్వల్, ప్రసాద్, తరుణ్,అఖిల్, చందు, రఘు, తదితరులు పాల్గొన్నారు.
