వరద బాధితులకు సేవా తరుణి ఆధ్వర్యంలో సామాగ్రి అందజేత

On
వరద బాధితులకు సేవా తరుణి ఆధ్వర్యంలో సామాగ్రి అందజేత

 

నమస్తే భారత్ :-తొర్రూరు

లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి క్లబ్ అధ్యక్షురాలు లయన్ తుమ్మూరు శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ హంటర్ రోడ్డులోని ముంపు ప్రాంతానికి గురైన బిఆర్ నగర్ కాలనీకి చెందిన వరద బాధితులకు రూ.38 వేల విలువగల బియ్యం, నిత్యవసర సరుకులు,చీరలు, టవల్స్, దుప్పట్లు, జ్యూట్ బ్యాగ్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, డిసిటి లయన్ చల్లా రఘునాథ రెడ్డి, డిసిఎస్ఎస్ లయన్ మార్గం ప్రభాకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే ఇలాంటి  నష్టాలు చాలా బాధాకరమని,కానీ అవి మన చేతుల్లో లేనివి కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ జీవన విధానాన్ని కొనసాగించాలని తెలియజేశారు.సిడబ్ల్యూసి చైర్ పర్సన్ లయన్ డాక్టర్ ఎస్. నాగవాణి బాదిత కుటుంబాల మహిళలకు కుట్టు మిషన్ మరియు మగ్గం వర్క్ లాంటివి నేర్పించే ప్రయత్నం చేస్తానని,అందుకు రఘునాథ రెడ్డి ,మార్గం ప్రభాకర్ సహకరిస్తానని తెలిపారు. బాధితులు మాట్లాడుతూ పూట తినడానికి తిండి లేని పరిస్థితిలో మాకు సహాయం చేయడం ఆనందంగా ఉందని, సహాయం చేసిన సేవా తరుణి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ మెంబర్ లయన్ డాక్టర్ ఎస్ నాగవాణి, ట్రెజరర్ లయన్ వేముల మంజుల, లయన్ ఉమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం...
అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉదాసీనత వైఖరి 
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
తాడ్వాయి మండలం కొత్తూరు ఊరట్టం కాలనీలో నీళ్ల కొరత 2023 సం, నుండి అధికారులు పంటించుకోవడంలేదు
ఘనంగా కమ్మ వారి కార్తీక మాస వన భోజనాలు 
బూర్గుల సుమన యాదిలో..
"ఆపద్బాంధవుడు" ఎస్సై గండ్రాతి సతీష్

Advertise