ప్రజా ప్రభుత్వంలోనే తీరుతున్న వరద కష్టాలు

On
ప్రజా ప్రభుత్వంలోనే తీరుతున్న వరద కష్టాలు

 

రూ.18.39 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన

వరంగల్ ఎంపీ కడియం కావ్య

నమస్తే భారత్ :-తొర్రూరు

ప్రజా ప్రభుత్వ సంకల్పంతోనే గ్రామీణ ప్రజల వరద కష్టాలు తీరుతున్నాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. 
మహబూబాబాద్ జిల్లా మండలంలోని కంటాయపాలెం, చర్లపాలెం గ్రామాల్లో రూ.18.39 కోట్లతో చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి లతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.ప్రజలు, రైతులు వాగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని, గత బిఆర్ఎస్ పాలనలో ప్రజలు వంతెన నిర్మాణం చేపట్టాలని నాటి పాలకులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో  నిధులు వెచ్చించి వంతెన నిర్మాణం పూర్తి చేయడంతో దశాబ్దాల కాలం నాటి సమస్యకు మోక్షం లభిస్తుందన్నారు. ఇప్పి ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు వరంగల్ మామునూరు కు విమానాశ్రయం తీసుకువచ్చానని, కాజీపేట రైల్వే డివిజన్ కలను సాకారం చేస్తున్నానని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పంతో పేద ప్రజలకు సొంతింటి కల సహకారమైందని, గత ప్రభుత్వం ఇండ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం అందించే సన్న బియ్యం తో వండిన భోజనాన్ని కడుపారా ఆరగిస్తున్నారన్నారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో కరెంటు కష్టాలు పోయాయన్నారు. మహిళలు నయా పైసా ఖర్చు లేకుండా ప్రయాణాలు సాగించి సంతోషంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అభ్యర్థన మేరకు 35 ఏళ్ల తర్వాత అమ్మమ్మ ఊరును చూసే అదృష్టం దక్కిందన్నారు.ప్రత్యేక ఎంపీ నిధులు కేటాయించి కంటాయపాలెం అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని కోరారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పేదల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తుందని, దానిలో భాగంగా ఆయా గ్రామాల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించి బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ ఎంపీ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు చీకొడుతున్నారని, జూబ్లీహిల్స్ లో ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టారన్నారు. ఇప్పుడు ఏ ఎన్నిక వచ్చినా గెలిచేది నిలిచేది కాంగ్రెస్ పార్టీ యేనని స్పష్టం చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకోవాలని, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఆర్ డిఈ  శ్రీనివాస రావు,ఈఈ విద్యాసాగర్, ఏఈలు నరేష్ రెడ్డి, దయాకర్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, డిటి నరసయ్య, ఎంఈఓ బుచ్చయ్య,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మహిళా బ్లాక్ అధ్యక్షరాలు పింగిలి ఉష, నాయకులు అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, పెరటి యాకూబ్ రెడ్డి,మోకాటి వెంకన్న, యనమల శ్రీనివాస్, మందపురి కుమార్, ఎనగందుల శ్రీనివాస్, ఉపేందర్, వాసు రెడ్డి,మహబూబ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారపు నాగయ్య,సుధాకర్, మల్లయ్య, శ్రీధర్, రాజు, అనిల్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
    అంగన్వాడీ టీచర్స్ మహేశ్వరీ/లక్ష్మి, విలేజ్ సెక్రెటరీ శేఖర్  బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఉపసర్పంచ్ వేణు నాయక్
ఎల్లంపల్లి ఎర్ర రాజశేఖర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం 
పోలీసుల నిర్లక్ష్యంతోనే కులదురహంకారం హత్యలు
సత్యసాయి జయంతి వేడుకలకు ఆహ్వానం
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత: రూరల్ ఎస్సై రాముడు
ప్రజా ప్రభుత్వంలోనే తీరుతున్న వరద కష్టాలు
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ  కొరకు జరుగుతున్న పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్. 

Advertise