సత్యసాయి జయంతి వేడుకలకు ఆహ్వానం
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్
నమస్తే భారత్:-కురవి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలో ఈనెల 23వ తేదీన ఘనంగా నిర్వహించనున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి వేడుకలకు హాజరుకావాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ను శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ కోరారు.మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ను కలిసి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చిత్రపటాన్ని, ఆహ్వానపత్రికను అందజేశారు. ఉదయం 5 గంటలకు నగరసంకీర్తనతో స్వామి వారి జయంతి వేడుకలు ప్రారంభం అవుతాయని, ఏడు గంటలకు రుద్రాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయని కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. సాయంత్రం 4గంటలకు శతవర్షమహోత్స రథయాత్ర ప్రారంభం అవుతుందని, కురవి పురవీధులలో శోభాయాత్ర నిర్వహించి ఏడుగంటలకు ప్రశాంతనిలయం చేరుకుని కేక్ కటింగ్, మంగళహారతి, పవలింపుసేవ నిర్వహించడంతో జన్మదిన వేడుకలు ముగుస్తాయని ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు తెలిపారు. తప్పనిసరిగా హాజరై బాబా వారి ఆశీస్సులు స్వీకరించాలని శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ను మర్యాదపూర్వకంగా కోరారు.ఈ.కార్యక్రమంలో సేవాసమితి బాద్యులు గండేపల్లి తిరుమలరావు తో పాటు సీనియర్ జర్నలిస్ట్ చీకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
