బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన

On
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన

 

అంగన్వాడీ టీచర్స్ మహేశ్వరీ/లక్ష్మి, విలేజ్ సెక్రెటరీ శేఖర్

 బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఉపసర్పంచ్ వేణు నాయక్

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 20:షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మెలగూడ తండా గ్రామంలోని  మహిళా, శిశు సంక్షేమస్కూల్ లో ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో,’ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న కిశోర బాలికలకు అమ్మాయిల విద్యాభద్రత, హక్కులు, అభివృద్ధి, బాల్యవివాహాల నివారణపై అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలు జరగకుండా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యతని, ఒకవేళ బాల్యవివాహం గురించి తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు సంప్రదించాలని విద్యార్థులకు వివరించారు.అవగాహన కార్యక్రమంలో “బాల్యవివాహాలు నిషేధించండి – బాల్యాన్ని రక్షించండి” నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అదనంగా సేవ్ గర్లు – సేవ్ నేషన్ అనే శీర్షికతో డ్రాయింగ్, వ్యాసరచన, మాట్లాడటం, పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా బాల్య వివాహాలు, శిశు విక్రయాలపై ప్రత్యేక సదస్సునిర్వహించారు.కార్యక్రమంలో విద్యార్థినిలు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మాజీ వార్డ్ మెబార్స్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise