అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సి. మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. 

On
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సి. మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. 

 

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 20_) ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు తమకు ఉన్న సమస్యలను కలెక్టర్ కు విన్నవించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో వయోవృద్ధులని కుటుంబ సభ్యులు నిరాదరణకు గురి చేస్తున్నారని, వారిని ఆలనా పాలన చూసుకునేవారు లేక ఒంటరితనంతో బాధపడుతున్నారని, పోషణ భృతి కొరకు సంబంధిత జిల్లా సంక్షేమ అధికారి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు ద్వారా చట్ట ప్రకారం వయోవృద్ధులకు పోషణ భృతి కల్పించేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 ఆయుష్మాన్ భారత్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని, వృద్ధులందరికీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేపిస్తామని, గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెం నందు స్పెషల్ క్యూ లైన్ మరియు  జిరియాటిక్ వార్డులను ఏర్పాటు చేపించి వృద్ధులకు ఉత్తమ సర్వీస్ అందేలా ఏర్పాటు చేస్తామని, స్పెషలిస్ట్ డాట్ డాక్టర్స్ తో వేల్ నెస్ సెషన్స్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం గురించి సంబంధిత అధికారులకు మాట్లాడి వారి సమస్యలు తీరుతామని,  వయో వృద్ధులకు ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ జరిగే ఫ్రాడ్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని అధిగమించడానికి అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేపిస్తామని  తెలిపారు.

 అడిషనల్ కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ వృద్ధులకు చేయూత పెన్షన్ 2016 రూపాయలు అందించడం జరుగుతుందని, కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారికి వెబ్సైట్ అందుబాటులో రాగానే అందరికీ తెలియజేసి దరఖాస్తు చేసుకునే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 60 సంవత్సరాలు నిండిన వయవృద్ధ మహిళలు పదిమంది గ్రూపుగా ఉన్నట్లయితే వారికి బ్యాంకులో నుంచి రివాల్యుయేషన్ ఫండ్స్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వయవృద్ధులు  ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేలా  చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 అనంతరం వృద్ధాశ్రమ నిర్వాహకులకు, వయోవృద్ధుల అసోసియేషన్ సభ్యులకు, వయోవృద్ధుల సంక్షేమం కోసం సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్, సందీప్, కృష్ణయ్య, శివప్రసాద్, యూసఫ్, శివ రామ్, భూషన్ రావు, వెంకటేశ్వర్లు, సిడిపివోలు లక్ష్మీ ప్రసన్న, పద్మశ్రీ, కార్యాలయ సిబ్బంది వర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడి టీచర్స్, వయోవృద్ధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
    అంగన్వాడీ టీచర్స్ మహేశ్వరీ/లక్ష్మి, విలేజ్ సెక్రెటరీ శేఖర్  బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఉపసర్పంచ్ వేణు నాయక్
ఎల్లంపల్లి ఎర్ర రాజశేఖర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం 
పోలీసుల నిర్లక్ష్యంతోనే కులదురహంకారం హత్యలు
సత్యసాయి జయంతి వేడుకలకు ఆహ్వానం
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత: రూరల్ ఎస్సై రాముడు
ప్రజా ప్రభుత్వంలోనే తీరుతున్న వరద కష్టాలు
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ  కొరకు జరుగుతున్న పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్. 

Advertise