పోలీసుల నిర్లక్ష్యంతోనే కులదురహంకారం హత్యలు

On
పోలీసుల నిర్లక్ష్యంతోనే కులదురహంకారం హత్యలు

 

 కులాంతర వివాహ
 రక్షణ  చట్టం తేవాలి.

కేవీపీఎస్ ఆధ్వర్యంలో 
రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

కేవీపీఎస్  జిల్లా కార్యదర్శి దూడ్డెల రామ్మూర్తి డిమాండ్ చేశారు

నమస్తే భారత్ :-మరిపెడ

మొయినాబాద్, షాద్ నగర్ పోలీసుల నిర్లక్ష్యంతోనే కులోన్మాదులుగా వ్యవహరించిన కొందరు వ్యక్తులు అత్యంత అమానవీయ క్రూరత్వానికి దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ హత్య జరిగిందనీ తక్షణమే  సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని నిందితులను కటినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి అన్నారు.గురువారం మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో కుల దుర అహంకార హత్యలను నిరసిస్తూ నిర్వహించిన సభలో రామ్మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎర్ర రాజశేఖర్ కులదురహంకార హత్యను ఖండిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి మాట్లాడుతూ దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ ను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడి అత్యంత దారుణంగా సజీవదహనం చేయడం ఘోరమని చర్యాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితమే ఈ కేసు వ్యవహారం పోలీసులు దృష్టిలో ఉన్నప్పటికీ బాధితుడి కుటుంబాన్నే మోయినాబాద్  షాద్ నగర్ పోలీసులు బాధితులను  బెదిరించడం, పెళ్లికి నిరాకరించడం జరిగిందన్నారు.వెంకటేష్(అమ్మాయి తండ్రి) మృతుడి ఇంటికి వెళ్లి రాజశేఖర్ ను బయటికి తీసుకు వెళ్లినప్పుడే అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తమ్ముడు ప్రేమకు సంబంధించి అన్నను ఒకవైపు పోలీసులు వేధించడం, మరోవైపు యువతి తండ్రి హత్యకు పాల్పడడం అత్యంత దారుణం అన్నారు.రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు రోజురోజుకీ పెరుగు.తున్నప్పటికీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆసిఫాబాద్లో శ్రావణి హత్య కూడా జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 142 కుల దురహంకార హత్యలు జరిగాయని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గాని ఈ వ్యవహారంపై స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇకనైనా దీనిపై శాసనసభలో చర్చించి కులాంతర వివాహాల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించకపోతే పోలీసు కార్యాలయాలను.ముట్టడించడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. రాజశేఖర్ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా వారి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ భార్య కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు .పోలీసులు ఇకనైనా దళితులకు రక్షణ కల్పించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా కులాంతర వివాహిత రక్షణ చట్టం కోసం నిర్వహించాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మం పేరుతో ప్రతీ రోజు మత విద్వేషాలు రెచ్చగొట్టే కేంద్రమంత్రి బండి సంజయ్, ఎల్లంపల్లిలో ఎర్ర రాజశేఖర్ ను ముస్లింలు క్రైస్తవులు చంపలేదని అగ్రకుల హిందువులు చంపితే దళితుడు మరణించారని చెప్పారు. 142 కుల దురహంకార హత్యల్లో బిజెపి కేవలం ఒకే చోట మాత్రమే స్పందించిందన్నారు. అక్కడ కూడా తమ రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే ప్రయత్నం చేసిందని మిగతా 141 కుల దురహంకార హత్యల్లో నిందితుల తరఫున బిజెపి నిలబడిందన్నారు కెవిపిఎస్ నేతలు నెగ్గు తేల్చారు. ఫాస్ట్ ట్రాక్కోర్టు ఏర్పాటు చేయాలని సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కెవిపిఎస్ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో  కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చయ్య, సీనియర్ నాయకులు పాల్వాయి దుర్గయ్య, మండల బాధ్యులు బాణాలు ఎల్లయ్య, నాయకులు వడ్లకొండ గంగరాజు, వినయ్, వెంకటేష్, నవీన్, స్వామి, బాబు, కవిత, కల్పన, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
    అంగన్వాడీ టీచర్స్ మహేశ్వరీ/లక్ష్మి, విలేజ్ సెక్రెటరీ శేఖర్  బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఉపసర్పంచ్ వేణు నాయక్
ఎల్లంపల్లి ఎర్ర రాజశేఖర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం 
పోలీసుల నిర్లక్ష్యంతోనే కులదురహంకారం హత్యలు
సత్యసాయి జయంతి వేడుకలకు ఆహ్వానం
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత: రూరల్ ఎస్సై రాముడు
ప్రజా ప్రభుత్వంలోనే తీరుతున్న వరద కష్టాలు
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ  కొరకు జరుగుతున్న పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్. 

Advertise