ఎల్లంపల్లి ఎర్ర రాజశేఖర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం 

On
ఎల్లంపల్లి ఎర్ర రాజశేఖర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం 

 

 షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

 తక్షణ సాయం కింద రూ. 50వేల చెక్కు అందజేత 

 అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వ సహకారమందేలా చూడాలని ఆర్డిఓకు ఆదేశం 

 బాధిత కుటుంబానికి రెండు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు 

 ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ 

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్20:సకుల ద్రహంకారంతో దళితుడు ఎర్ర రాజశేఖర్ ను హత్య చేయడం అత్యంత దారుణమని దీనిపై ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎస్సీ విభాగం కాంగ్రెస్ నాయకులు బాదేపల్లి సిద్ధార్థ, ఎస్సీ సెల్ అధ్యక్షులు కర్రోళ్ల సురేందర్, యువ నాయకుడు జాంగారి రవి, సీనియర్ నేత ఎర్రోళ్ల జగన్ సింగపాగ అనిల్ కుమార్ నాగి సాయిలు బొరిగి నరేందర్ ప్రధాన కార్యదర్శి జాంగారి జంగయ్య, కొమ్ము కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, రఘునాయక్, పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు గౌడ్, యువ నేత కేకే కృష్ణ బీసీ సెల్ అధ్యక్షుడు జాకారం చంద్రశేఖర్ ఎల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భవాని మల్లేష్ తదితరులు ఎమ్మెల్యే వెంటా గ్రామాన్ని సందర్శించారు.హత్యకు గురైన దళితుడు ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ స్పష్టం చేశారు. రాజశేఖర్ తండ్రి మల్లేష్, భార్య వాణి తదితర కుటుంబ సభ్యులతో ఆయన గ్రామంలో సమావేశం అయ్యారు. ఆ కుటుంబానికి తన సొంతంగా 50వేల రూపాయలు ఖర్చుల నిమిత్తం అందజేశారు. అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ను అందేలా చూడాలని ఆర్డిఓ సరితకు ఫోన్లో ఆదేశించారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి వారికి ఉన్న సమస్యలు ప్రభుత్వపరంగా అన్ని తీర్చాలని వీరికి బ్యాంకు ఖాతా లేదని దానిని వెంటనే తెరిపించి వారికి బెనిఫిట్ సందేలా చూడాలని ఆర్డిఓకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఆదేశించారు. సమాజంలో ఇలాంటి చర్యలను ఎవరు హర్షించరని ఒక దళితుడు ప్రేమించాడని అతన్ని ఘోరంగా చంపడం సభ్య సమాజం తలదించుకునే చర్య అని అన్నారు. సమాజంలో తనకు నచ్చిన విధంగా ప్రేమించడం తప్పు కాదని ఇద్దరు పరస్పరం ప్రేమించుకున్నప్పుడు ఆ తప్పు ఒకరిపై నెట్టి అతని చంపడం హేయమైన చర్యని ఖండించారు. రాజ్యాంగంలో అందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రేమించుకోవడం నేరం కానే కాదని ఆ మాటకొస్తే తన ఇంట్లో కూడా సభ్యులు ప్రేమ వివాహం చేసుకున్నారని సమాజంలో ఎంతోమంది ప్రేమ వివాహాలు చేసుకుని ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎర్ర రాజశేఖర్ ను హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే పట్టుకొని ఎనిమిది మందిని రిమాండ్ కు తరలించడం జరిగిందని వారికి కోర్టులో శిక్ష పడేవిధంగా కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సహకరిస్తుందని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.చనిపోయిన తన కొడుకు ఎర్ర రాజశేఖర్ కు ఊరే సరిగా తెలియదని అతను షాద్ నగర్ లో ఏవో చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని 30 ఏళ్ల క్రితమే ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయామని ఈ మధ్యకాలంలో తాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయ్యాక ఇల్లు కట్టుకొని ఊర్లో ప్రశాంతంగా ఉందామని భావించామని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని రాజశేఖర్ తండ్రి మల్లేష్ ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆర్థికంగా భూముల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ప్రభుత్వం తగిన దృష్టితో తనకు న్యాయం చేయాలని హంతకులను కఠినంగా శిక్షించాలని తండ్రి ప్రాధేయపడ్డారు. తన కుమారుడి దినాల కార్యక్రమాల కోసం తన చిన్న కుమారుడు చంద్రశేఖర్ ఊరికి రప్పించాలని అతనికి ప్రభుత్వం అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ అధికారులు నాయకులు తన కుటుంబాన్ని రక్షించాలని మల్లేష్ ఎమ్మెల్యే ఎదుట ప్రాదేయపడ్డారు.
గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన అమ్మాయి భవానీని వివాహం చేసుకున్న చంద్రశేఖర్ కు అతని కుటుంబానికి అందరికీ రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాన్నిదని పోలీసులకు ఇదివరకే తాను ఆదేశించినట్లు తెలిపారు. దిన వారాల కోసం చంద్రశేఖర్ గ్రామానికి వస్తే వారికి పూర్తిస్థాయిలో అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ దళిత సంఘం నాయకులు బాదేపల్లి సిద్ధార్థ, జంగారీ రవికి సూచించారు. కష్టకాలంలో ఈ కుటుంబానికి అండగా ఆసరాగా నిలబడాలని వీరికి ప్రభుత్వం తరఫున అందే ప్రతి సహాయంలో దగ్గర ఉండి మరి చూసుకోవాలని స్థానిక కాంగ్రెస్ నేత జంగారీ రవికి ఆదేశించారు. అనంతరం 50 వేల రూపాయల చెక్కును మృతుడి భార్య వాణి అదేవిధంగా తండ్రి మల్లేష్ చేతుల మీదుగా ఎమ్మెల్యే చెక్కు అందజేశారు.

Tags

Share On Social Media

Latest News

బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
    అంగన్వాడీ టీచర్స్ మహేశ్వరీ/లక్ష్మి, విలేజ్ సెక్రెటరీ శేఖర్  బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఉపసర్పంచ్ వేణు నాయక్
ఎల్లంపల్లి ఎర్ర రాజశేఖర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం 
పోలీసుల నిర్లక్ష్యంతోనే కులదురహంకారం హత్యలు
సత్యసాయి జయంతి వేడుకలకు ఆహ్వానం
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత: రూరల్ ఎస్సై రాముడు
ప్రజా ప్రభుత్వంలోనే తీరుతున్న వరద కష్టాలు
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ  కొరకు జరుగుతున్న పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్. 

Advertise