కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ కొరకు జరుగుతున్న పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్.
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 20_) రుద్రంపూర్ సింగరేణి : ఈ వార్షిక సంవత్సరం 2025-26 లో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ కొత్తగూడెం ఏరియాలో నిర్వహించుటకు నిర్ణయించడమైనది అందులో భాగంగా తేదీ.20.11.2025 (గురువారం) న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు గారి ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కాలనీలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్ నందు కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ కొరకు ప్లే గ్రౌండ్ ను మరియు క్రీడాకారుల కొరకు ఏర్పాటు చేసిన వసతి గృహాలను సంబంధిత అధికారులు డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం(ఈ &ఎం) ఏరియా వర్క్ షాప్ జె. క్రిస్టఫర్, డివై ఎస్ఈ (సివిల్) కే. రాజా రామ రావు, మరియు ఇతర అధికారులతో కలసి పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా జిఎం గారు మాట్లాడుతూ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు ప్లే గ్రౌండ్ లెవలింగ్, కబడ్డీ కోర్ట్స్, స్టేజ్ ప్రిపరేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మన కొత్తగూడెం ఏరియా నందు నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్ 28.11.2025 నుండి 30.11.2025 నిర్వహించడం జరుగుతుందని అందుకు కావలసిన పనులను ఏమాత్రం నిర్లక్ష్యము, జాప్యం లేకుండా ప్రత్యేక చొరవతో, వివిధ కమిటీలుగా ఏర్పడి కంపెనీ లెవెల్ లో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరల మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవెల్ క్రీడా పోటీలను నిర్వహించుటకు అనుమతులు పొందేలా ఈ క్రీడలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
అలాగే కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ నిర్వహణకు అవసరమైన వసతులను (గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్స్, క్రీడలను ఆడుటకు వస్తున్న క్రీడాకారులకు వసతి గృహము, భోజన వసతి మరియు కబడ్డీ కోర్ట్ ప్రిపరేషన్, సాయంత్రం సమయాలలో కూడా నిర్వహించుటకు ఫ్లడ్ లైట్ సదుపాయాము మరియు ఇతర కబడ్డీ నిర్వహణకు కావలసిన పనులను గూర్చి సంబంధిత అధికారులచే గ్రౌండ్ నందు పర్యటించి ఎటువంటి లోటు పాటులు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిఎం గారితో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం(ఈ &ఎం) ఏరియా వర్క్ షాప్ జె. క్రిస్టఫర్, డివై ఎస్ఈ (సివిల్) కే. రాజా రామ రావు, డివై ఎస్ఈ (ఈ&ఎం) టి. అనిల్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ బి. భీముడు, స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ బి. వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ ఆర్గనైజర్స్ సిహెచ్ సాగర్, మహేష్ ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
