Tag
KPHB
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
యాదవ సంఘం ఆధ్వర్యంలో వనబోజనాలు
Published On
By Shiva Kumar Bs
హైదరాబాద్ : వనబోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనుషుల మధ్య స్నేహభావం పెంపొందిస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కూకట్ పల్లి మలేషియా టౌన్ వేణు గోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా వేణు గోపాల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక సమారాధనలు దోహదపడతాయని అన్నారు. కార్తీక మాస వనసమారాధనలతో కుల సంఘాల మధ్య ఐక్యత పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లిలో బాపు జయంతి
Published On
By Shiva Kumar Bs
టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
MIRAI : మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ సందడి
Published On
By Shiva Kumar Bs
మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ లో సందడి చేశారు. మీమా జ్యువెలరీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి షోరూంను కేపి.హెచ్.బి కాలనీలోని 3వ ఫేజ్ లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా Mirai Heroin Rithika Naik మాట్లాడుతూ., ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశం తాకుతున్న వేల... KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి
Published On
By Shiva Kumar Bs
కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ విచ్చల విడిగా తెల్లవార్లూ న్యూసెన్స్ సృష్టిస్తూ స్థానికులకు ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, హాస్టల్ల ముసుగులో చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతోసమావేశం నిర్వహించారు స్థానికంగా ఉండే యువ నేతలు జాన్ మోజెస్, సయ్యద్ రావెల్షా.
కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.!
Published On
By NAMASTHEBHARAT
ప్రశ్నించిన యువకుడిని హాస్టల్‌లోనికి వెళ్లి దాడి
హాస్టల్ కిటికీలు తలుపులు పగలగొట్టిన అన్నవరం అండ్ గ్యాంగ్
దాడికి పాలుపడిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కూకట్ పల్లి: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడిన దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరంతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్ 3లోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌పై అర్థరాత్రి జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, కేపీహెచ్‌బీ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం తన గ్యాంగ్‌తో కలిసి మద్యం మత్తులో హాస్టల్ సమీపంలో వెళ్తున్న ఒక యువతిని వేధించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వెంకటేష్ అనే యువకుడు వారిని అడ్డుకుని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించాడు. ఈ మాటలకు ఆగ్రహించిన గ్యాంగ్, వెంకటేష్‌పై దాడికి దిగింది.ప్రాణభయంతో వెంకటేష్ సమీపంలోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌లోకి పారిపోయాడు. అయితే, అన్నవరం అండ్ గ్యాంగ్ అతడిని వదలకుండా హాస్టల్‌లోకి దూసుకెళ్లారు. కర్రలతో హాస్టల్ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, ఆ తర్వాత వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ అనూహ్య ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగు తీశారు. రాత్రి చదువుకుంటుండగా ఒక్కసారిగా కిటికీలు పగులగొడుతున్న శబ్దం వినిపించింది. గ్యాంగ్ లోపలికి వచ్చి అల్లరి చేయడంతో ఒక్కసారిగా భయానికి గురయ్యామని హాస్టల్ విద్యార్థులు భయంతో చెప్పారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం, అతని అనుచరులపై దాడి, ఆస్తి ధ్వంసం, హౌస్‌ట్రెస్పాస్, అసభ్యకర వ్యాఖ్యల వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోగా.. మరి కొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదని, యువతులపై వేధింపులకు ఇదొక సంకేతమని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 