#Samskruthi ఇంటర్నేషనల్ స్కూల్ లో బాలల దినోత్సవం
వివిధ వేషధారణ లో చూడ ముచ్చటగా చిన్నారులు
On
- విద్యార్థుల్లో సామాజిక బాధ్యత భావం పెంపొందించడమే లక్ష్యం
- ఈ కార్యక్రమంతో సేవా వృత్తుల విలువ తెలుసుకునే అవకాశం
- సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ శశిపాల్ రెడ్డి
నేడు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు : ప్రిన్సిపల్ రెహినా
చేవెళ్ల : బాలల దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధి పామెన గ్రామ శివారులోని గల సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో గురువారం కమ్యూనిటీ హెల్పర్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీ నిర్వహించారు. వైద్యులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, సైనికులు వంటి వేషధారణలతో చిన్నారులు భలే ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావం పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల డైరెక్టర్ శశిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సేవా వృత్తుల విలువను అర్థం చేసుకునే అవకాశం లభించిందన్నారు. నేడు ( శుక్రవారం ) కూడా బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ రెహీన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
14 Nov 2025 15:16:52
హైదరాబాద్, నవంబర్ 14: అందరూ ఊహించినట్లుగానే జూబ్లీహిల్స్‌లో వార్ వన్‌సైడ్ అయ్యింది.. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పినదాని కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి...

