మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
షాద్ నగర్ వైద్యాధికారి స్రవంతి
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 18:షాద్ నగర్ డివిజన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు లో వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజల చేత జె .శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ప్రతిజ్ఞ " నేను మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని,నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను"జై భారత్ ! జై హింద్ ! ఈ కార్యక్రమంలో చించోడు వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ, హెల్త్ ఎడ్యుకేటర్ జే.శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ చంద్రకళ, స్టాప్ నర్సులు సువర్ణ , పకీరమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శివకుమార్, ఏఎన్ఎంలు ఇస్తేర్ రాణి ,విజయలక్ష్మి, మరియు ఆశలు, ఆఫీస్ సిబ్బంది శ్రీనివాసులు, మణెమ్మ, ఆసుపత్రికి వచ్చినా ప్రజలు పాల్గొన్నారు.
