జూబ్లీహిల్స్ ప్రజల చక్కని తీర్పు
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
షాద్ నగర్ లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపు సంబరాలు
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు చాలా చక్కని తీర్పు ఇచ్చారని ఈ గెలుపు బిఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబ నాయకుల అహంకారానికి గుణపాఠం లాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన గెలుపును పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. బి ఆర్ ఎస్ ను నమ్ముకుంటే ఏం జరుగుతుందో జూబ్లీహిల్స్ ప్రజలు నిరూపించారని ఇది కల్వకుంట్ల కుటుంబానికి చెంపపెట్టు అని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నామన్న సోయి లేకుండా బాధ్యతగా మాట్లాడకుండా నవీన్ యాదవ్ ఆయన కుటుంబాన్ని విమర్శించారని కానీ ప్రజలు ఎవరు రౌడీలో ఎవరు గుండాలో తేల్చేసారని ఈ గెలుపు దీనికి నిదర్శనం అని అన్నారు.వాళ్ల దారుణాలు దౌర్జన్యాలు తెలంగాణ ప్రజలకు తెలియనిది కాదని అన్నారు. ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కని తీర్పు ఇచ్చారని అన్నారు
