ప్రభుత్వ ఆసుపత్రికి  వచ్చేది పేద ప్రజలే

On
ప్రభుత్వ ఆసుపత్రికి  వచ్చేది పేద ప్రజలే

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ  లక్ష్యం

గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్టు నెలకు 1000 రూపాయలు ఇచ్చే డబ్బులు  ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు

ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరింది

కొద్దిపాటి వర్షం పడితే చాలు భవనం మొత్తం  కురుస్తూ పేచ్చులు ఊడి పేషంట్లపై పడే పరిస్థితి

తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కవిత

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్20:ప్రభుత్వ ఆసుపత్రికి  వచ్చేది పేద ప్రజలే కనుక  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్టు నెలకు 1000 రూపాయలు ఇచ్చే డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. షాద్ నగర్ పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తయినా కూడా ఇంకా పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి మార్చలేదన్నారు. ఈ ఆస్పత్రి సందర్శించాక తాను ఇక్కడున్నా సమస్యలు గుర్తించడం జరిగిందని ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరిందని కొద్దిపాటి వర్షం పడితే చాలు కురిసే పరిస్థితి, పేచ్చులు ఊడి పేషంట్లపై పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది ఇదె జిల్లా కనుక ఈ ఆస్పత్రి పై దృష్టి పెట్టి  వెంటనే స్పందించి శిథిలమైన భవనాన్ని వెంటనే వంద పడకల ఆసుపత్రికి మార్చాలని, అదేవిధంగా డాక్టర్ల, సిబ్బంది కొరత ఉందని  నాణ్యమైన వైద్య సేవల కోసం సిబ్బంది సంఖ్య పెంచాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో  స్థానిక నాయకులు పాండు రంగారెడ్డి,  ముస్తఫా, సీమ రమేష్ తో పాటు జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise