ప్రతి శుక్రవారం ఎలికట్ట అంబాభవాని ఆలయంలో ఘనంగా పంచామృతాభిషేకం
చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలి.
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:షాద్ నగర్ నియోజకవర్గం ఎలికట్ట
అంబాభవాని మాత దేవాలయంలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో భాగంగా దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముత్యాలరాజు ఆధ్వర్యంలో అయోధ్యపూర్ తండా గ్రామ వాస్తవ్యులు లింబ్య నాయక్ దంపతులు అభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నారం వెంకట్రాంరెడ్డి, బోయినపల్లి ఆంజనేయులు గౌడ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.దేవాలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చన, హారతి సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింబ్య నాయక్ దంపతులు స్వయంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, గంగాజలం, పంచదారలతో అభిషేకం చేశారు.కమిటీ చైర్మన్ ముత్యాలరాజు మాట్లాడుతూ.అమ్మవారి ఆశీస్సులతో ఎలికట్ట గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి భక్తుల సహకారం అవసరమని పేర్కొన్నారు.కమిటీ సభ్యుడు నారం వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.ప్రతి శుక్రవారం ఇలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం కార్యక్రమం కూడా చేపడుతున్నామని తెలిపారు.షాద్ నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
