షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్ లో ముగిసిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం
స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో పలు కేసులు రాజీ
కేసుల పరిష్కారంలో పోలీసులు మరియు న్యాయవాదులు
సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించిన అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు మండలం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ స్వాతి రెడ్డి
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్15:వివిధ కేసుల పరిష్కారం దిశగా సాగిన లోక్ అదాలత్ కార్యక్రమం అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ స్వాతి రెడ్డి ఆదేశాలతో ప్రారంభమై ఈరోజు సాయంత్రం ముగిసింది. స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ స్వాతి రెడ్డి తో పాటు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పట్టణ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజీమార్గమే రాజమార్గంగా సాగిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని వివిధ క్రిమినల్ కేసులలో రాజీ కుదుర్చుకున్నారు. ప్రత్యేకంగా సాగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో నేరం ఒప్పుకున్న కేసులకు గాను 92 క్రిమినల్ కేసులు పరిష్కారం కాగా, 71 క్రిమినల్ కేసులలో కక్షిదారులు రాజీ కుదుర్చుకుని కేసులను పరిష్కరించుకోగా మొత్తం 163 క్రిమినల్ కేసులు పరిష్కరించబడ్డాయి.. స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా కేసుల పరిష్కారానికి చొరవ చూపిన న్యాయవాదులను మరియు పోలీసులను, కోర్టు సిబ్బందిని అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ స్వాతి రెడ్డి అభినందించారు.
