ఛలో హైదరాబాద్ సి.డి.ఎం.ఎ ఆఫీస్ .
మున్సిపల్లో పని చేసే కార్మికులకు కనీసం వేత్తనం 26000/- రూపాయలు ఇవ్వాలి. -ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఏసు రత్నం.
మున్సిపల్ రంగంలో పని ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేత్తనం 26000/- అలాగే కార్మికుల సమస్యల పై నవంబర్ 26వ తేదీన ఛలో హైదరాబాద్ జయప్రదం చేయాలనీ, కార్మికులను కోరడం జరిగింది. సి.డి.ఎం.ఎ ఆఫీసు ముందు ధర్నాకు సంబంధంచిన వినతిపత్రని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేబ్బీర్ అలీ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుయ్ కోలన్ గోపాల్ రెడ్డి,ఈ కార్యక్రమనికి ఏఐటీయూసీ మున్సిపల్ స్టాప్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఏసు రత్నం, ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబర్ 26వ తేదీన ఛలో హైదరాబాద్ లో భాగంగా సి.డి.ఎం.ఎ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం ఉంది. అన్ని ఈ కార్యక్రమనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపల్ లో పని చేసే కార్మికులు హాజరై వారి సమస్యలు పరిస్కారం కోసం పెద్ద ఎత్తున్న కార్మికులు తరలి వస్తున్నారు అన్ని అన్నారు. మున్సిపల్లో పని చేసే కార్మికులకు కనీస వేతనం 26000/- రూపాయలు చేయాలనీ, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఇఎస్ఐ, పిఎఫ్ లేని వారికీ కల్పించాలని, క్యాజువల్ లివలు ఇవ్వాలని గత కెసిఆర్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్బంగా మున్సిపల్ కార్మికులు దేవుళ్లు అన్ని కచ్చితంగా మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తాను అన్ని చేయలేదు అన్ని గుర్తుచేశారు. కెసిఆర్ గతంలో ఓడదాటేదాకా ఓడ మల్లన్న, ఓడదాటినంక బోడమల్లయ్య అన్నట్లు ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయలేదు అన్ని అన్నారు. కెసిఆర్ మోసం చేసిండు అన్ని కాంగ్రెస్ ను గెలిపిస్తే, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మారచ్చిపోయారని, మాకు వేతనాలు పెంచక సుమారుగా 6సంవత్సరాలు అయింది అన్ని అన్నారు. వేతనాల సవరణ కాలం జూలై 22,2022కు అయిపొయింది అన్ని, కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం pay రివిజన్ మాటే లేదు అన్ని కనుక వెంటనే కనీస వేత్తనము 26000/- చేయాలనీ వారు డిమైండు చేశారు. అలాగే నవంబర్ 26వ తేదీన జరగబోయే ఛలో హైదరాబాద్ కార్యక్రమనికి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
