బాల్యవివాహాల నిర్మూలన పై విస్తృత ప్రచారం చేయండి

On
బాల్యవివాహాల నిర్మూలన పై విస్తృత ప్రచారం చేయండి

 

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్


నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం


భద్రాద్రి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్ )సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనకై వందరోజుల ప్రచార ఉద్యమ గోడ పత్రికను ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాల్యవివాహాలు లేని తెలంగాణ లక్ష్యం లో భాగంగా భద్రాద్రి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లా గా తెలంగాణలో కీర్తికెక్కెలా అధికారులు స్వచ్ఛంద సంస్థలు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు . స్వయం సహాయక బృందాల వారు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు మహిళలు ఈ బాల్య వివాహ నిర్మూలన ప్రచారోద్యమంలో కీలక భూమిక పోషించాలని మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని ఆయన పిలుపునిచ్చారు.
ఆడపిల్లల సర్వతో ముఖాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డుగోడలు కాకూడదని, ఎవరైనా బాల్యవివాహాలను చేయడానికి ప్రయత్నించిన సహకరించిన చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని హెచ్చరించారు. బాలల యొక్క సమస్యలను 24 గంటలు పని చేసే చైల్డ్ లైన్ 1098 కి ఫోన్ చేసి తెలపాలని కోరారు. జిల్లా. బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలలందరూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 
ఈ కార్యక్రమం  లో ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్  టీం సభ్యులు మాన్సింగ్, జ్యోతి, మోహన్, మౌనిక తదితరులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Related Posts

Latest News

జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
    - భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన
అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
ఊరట్టం గ్రామపంచాయతీ ఘనంగా బిర్సా ముండా150 జయంతి వేడుకలు
భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం  తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ 
ఎంపీ డి కె అరుణ కు స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సుంకు ఉమేష్ కుమార్
మేడారం సమ్మక్క సారాలమ్మ దీవెనలతో మండపు లక్ష్మన్ రాజు (రెడ్డిగూడెం)

Advertise