మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ
మాలలు పోరాటానికి సిద్ధం కావాలి: ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు శేఖర్
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ నియోకవర్గం, ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం, కిషన్ నగర్ గ్రామాలలో మాలల రణభేరి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ, ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు శేఖర్ పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 23వ తేదీన సరూర్నగర్ లోని జరగబోయే మాలల రణభేరి మహాసభను చేయాలని పిలుపునిచ్చారు. మాలలు హక్కులకై ఉద్యమించాలని కోరారు. మాల ప్రజలు తమ ఉనికి చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాల మహానాడు డివిజన్ కార్యదర్శి , బర్ల శ్రీనివాస్, శివ శంకర్, లింగం, రవి, అనిల్, రామచంద్రయ్య, చెన్నయ్య, మానెమ్మ, పద్మమ్మ, పార్వతమ్మ, చిన్నమ్మ, అండాలు, అంజమ్మ, సబిత, కిష్టమ్మ, అంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
