విద్యార్థి సంఘాలకు ఎమ్మెల్యే బెదిరింపులు.!

On
విద్యార్థి సంఘాలకు ఎమ్మెల్యే బెదిరింపులు.!

 

మీరేమైనా ఎమ్మెల్యేలా? మంత్రులా? అంటూ విద్యార్థి సంఘాలను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే.!
ఏఐఎస్ఎఫ్  ఆకాష్ నాయక్ కు ఎమ్మెల్యే హెచ్చరింపు. 

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:మరోసారి హాస్టళ్ళలోకి వెళ్తే మీపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానంటూ విద్యార్థి సంఘం నాయకుడు ఆకాష్ నాయక్ కు పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని మీడియా ద్వారా తెలిపాడు.గత వారం కిందట వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలం బండ్లవెలికిచర్ల వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేయడానికి వెళ్లగా మీరేమన్నా ఎమ్మెల్యేలా, మంత్రులా అంటూ ప్రశ్నించడంతో పాటు మీపై కేసులు పెట్టి లోపల వేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పినట్లు అన్నారు.ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ,,విద్యార్థుల సమస్యల పై మాట్లాడితే కేసులు పెడ్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం అంటున్న ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, సమస్యల గురించి వినతిపత్రం అందజేయడానికి వెళ్లిన మాపై ఒక ఎమ్మెల్యే ఇలా హెచ్చరికలు చేయడామేనా అంటూమండిపడ్డారు. ప్రజా పాలన అంటే కేసులు పెట్టడమేనా? అంటూన్నారు. బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే పై ప్రభుత్వం అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise