ఘనంగా కమ్మ వారి కార్తీక మాస వన భోజనాలు 

On
ఘనంగా కమ్మ వారి కార్తీక మాస వన భోజనాలు 

 

అన్నారోగ్యంతో బాధపడుతున్న ప్రైవేట్ లెక్చరర్ శివ కుమార్ కు ఆర్ధిక సహాయం

కమ్మ మహిళా సేవా సమితి సభ్యుల ఔదార్యం

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 09:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కమ్మ సేవా సమితి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో కార్తీక వన భోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు భాను శర్మ ధాత్రి పూజ ఉసరి చెట్టు దగ్గర నిర్వహించారు. అనంతరం నందమూరి తారక రామా రావు విగ్రహానికి పూలమాలలు వేసి హరీశ్ శర్మ యాంకరింగ్ లో గాయని గాయకులు పాటలతో అలరించారు. రాగిణి శర్మ నేతృత్వం లో చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకుల్ని అలరించింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరల్డ్ ఎగ్ కమిషన్ చైర్మన్ చిట్టూరి సురేష్ రాయుడు, కమ్మ వారి సేవా సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాయాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లు హాజరైనారు.ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.ఎన్ని పనులు ఉన్నా షాద్ నగర్ కమ్మ బంధువులతో ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని, నేటీ 10 వ వనమహోత్సవంలో పాల్గొనటం ఆనందంగా ఉందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని విధంగా మహిళలు వారి సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయం అన్నారు. కమ్మ సేవా సమితి షాద్ నగర్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు కృషి ఫలితంగా ఈ నాడు పౌల్ట్రీ రైతుల పన్ను రద్దు జరిగిందని, వేమునరేందర్ రెడ్డి గారి సహకారంతో మేము చేసిన ప్రయత్నాలతో ఇది జరిగిందని వాటి వివరాలు పూర్తిగా వివరించారు. కొంత మంది కావాలని ఏదేదో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాటి వాళ్ళ ను పట్టించుకోవద్దని, మన పని మనం చేసుకుంటూ పోవాలని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీతో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం కమ్మ మహిళా సంఘం ఆధ్వర్యంలో అన్నారోగ్యంతో బాధపడుతున్న ప్రైవేట్ లెక్చరర్ శివ కుమార్ కు 25000 రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. ఇది చూసిన వారు మానవత్వంతో అందరూ కలసి సుమారు 1,50000 రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఆపరేషన్ల కు అయ్యే ఖర్చు మొత్తం ప్రత్యేక నిధుల నుండి ఇప్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి నాయకులు పాతూరి వెంకట్రావు , పినపాక ప్రభాకర్, గుదే వసంతరావు , బండారు పల్లి నాగేశ్వర్ రావు, వట్టికూటి రామసుబ్బారావు, వట్టికొండ ఎర్రయ్య, హరి కుమార్, శశి, జొన్నలగడ్డ శ్రీనివాస రావు, కొత్త ప్రభాకర్, మక్కపాటి మల్లేశ్వర రావు,  కట్టా హరి, కొర్రపాటి శ్రీను, మలినేని సాంబశివ రావు, శ్రీనివాస్, పాతూరి భ్రమయ్య , పాతూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం...
అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉదాసీనత వైఖరి 
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
తాడ్వాయి మండలం కొత్తూరు ఊరట్టం కాలనీలో నీళ్ల కొరత 2023 సం, నుండి అధికారులు పంటించుకోవడంలేదు
ఘనంగా కమ్మ వారి కార్తీక మాస వన భోజనాలు 
బూర్గుల సుమన యాదిలో..
"ఆపద్బాంధవుడు" ఎస్సై గండ్రాతి సతీష్

Advertise