* ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి సీతక్క
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
/
గోవిందరావుపేట మండల కేంద్రంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు దనసరి అనసూయ సీతక్క విచ్చేసి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు
ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం అని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు వైద్యం మరియు మెడికల్ ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయం నిధి పని చేస్తుంది అని, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందజేస్తుంది అని, ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా మెడికల్ ఖర్చులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం నిజంగా హర్షణీయం అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేద ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో మొత్తం 14 మంది లబ్ధి దారులకు 7 లక్షల 39 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందాయని తెలియజేశారు. ఈకార్యక్రమంలో గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, జిల్లా కార్మిక శాఖా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సూరపనేని నాగేశ్వర్ రావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య గార్లతో పాటుగా గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
