సిపిఎం తోనే గ్రామ అభివృద్ధి

On
సిపిఎం తోనే గ్రామ అభివృద్ధి

 


సిపిఎం పసర సర్పంచ్ అభ్యర్థి రాజేష్ దేవేంద్ర కరారు

 

ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)


సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి
గోవిందరావుపేట మండలం నిరంతరం ప్రజలతో జీవించే ప్రజానాయకుడు పసర సిపిఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గొంది రాజేష్ దేవేంద్ర లను పసర గ్రామ ప్రజలు ఆదరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సిపిఎం పార్టీ పసర గ్రామ విస్తృత స్థాయి సమావేశం కడారి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ సిపిఎం పార్టీ   తరపున పసర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గొంది రాజేష్ దేవేంద్ర లను ప్రకటించారు.   అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించిందని ఆయన తెలిపారు. పసర గ్రామంలో గత 40 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడిందని ఆయన తెలిపారు. గత 30 సంవత్సరాలు సిపిఎం పార్టీ సర్పంచిగా గెలిచి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పాటుపడడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామంలో ప్రజల ఐక్యతను కాపాడిందని  రైతులు కూలీల  పక్షాన నిలబడిందని అన్నారు.నిరుపేదలకు ఇంటి స్థలాలు కావాలని,రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని,అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు.
 గత ఐదు సంవత్సరాల కాంగ్రెస్ గ్రామపంచాయతీ పాలన పూర్తి అవినీతిమయం అయిందని పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆయన ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కుంటుబడిందని పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వీర్యం అయిందని   వాటర్ ప్లాంట్ మూసివేశారని అన్నారు.గ్రామంలో అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ నాయకులు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పర్సంటేజ్  కోసం పాకలాడుతున్నారని ఆరోపించారు.సిపిఎం పాలన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని ప్రజలకు ఏ కష్టం వచ్చినా సిపిఎం సర్పంచులు అందుబాటులో ఉంటారని అన్నారు. కాంగ్రెస్కు మరోసారి అధికారం అప్పజెప్తే గ్రామ అభివృద్ధి మరో 20 సంవత్సరాలు కుంటుపడుతుందని అన్నారు. గ్రామంలో  కులాల మధ్య వైశ్యమ్యాలు పెరిగిపోయని తెలిపారు.ఇలాంటి వారికి ప్రజలు పాలన అప్పగించవద్దని అన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థి రాజేష్ దేవేంద్రను గెలిపించడం ద్వారా గ్రామ ప్రజలు తమ హక్కులు సాధించుకోవచ్చని పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనుక కొట్టవచ్చని తెలిపారు. గ్రామంలో ప్రజల మధ్య సామరస్య ధోరణి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి ,పొదిల్ల చిట్టిబాబు జిల్లా కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి, తీగల ఆగిరెడ్డి ,మండల కమిటీ సభ్యులు అంబాల మురళి ,  క్యాతం సూర్యనారాయణ, ముమ్మడి ఉపేంద్ర చారి,గ్రామ కమిటీ సభ్యులు రెడ్డి పురుషోత్తం రెడ్డి ,జుట్టబోయిన రమేష్,కందుల రాజేశ్వరి,మంచాల కవిత, శ్రీ రామోజు సువర్ణ ,యానాల ధర్మారెడ్డి, సప్పిడి ఆదిరెడ్డి,పల్లపు రాజు, బుర్ర శ్రీనివాస్,మన్సొజు బ్రహ్మచారి, ఐలయ్య,పాయం శారద, మచ్చ సువర్ణ, సంకినేని రాజేశ్వరి, చిన్నపల్లి అశోక్,   కొమ్ము రాజు సరళ, సులోచన, బ్రహ్మచారి, ఎండి సిరాజ్,కళ్లెం నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

పోలీసుల వైఫల్యంతోనే  ఎర్ర రాజశేఖర్ హత్య పోలీసుల వైఫల్యంతోనే  ఎర్ర రాజశేఖర్ హత్య
    కుల అహంకార ధోరణితో జరిగిన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం  ఎర్ర రాజశేఖర్ హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి  రాజశేఖర్
రైతన్న మీకోసం కార్యక్రమం
ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన మందకృష్ణ మాదిగ 
గండిపేట లో నూతన ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ స్టేషన్ ప్రారంభం
* కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో జరుగు ధర్నా లను జయప్రదం చేయండి 
సిపిఎం తోనే గ్రామ అభివృద్ధి
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం

Advertise