లక్నవరం తైబందీ వెంటనే ప్రకటించాలి
ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)
గోవిందరావుపేట మండలం పసరలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుమ్మల వెంకటరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ లక్నవరం చెరువు కింద తైబందిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరము లక్నవరం చెరువు కింద అధిక వర్షాలతో పంట దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయని ఎకరాకు 20 బస్తాలు కూడా అంటే 14,15 కింటాలు రావడంలేదని పేర్కొన్నారు గత సంవత్సరం రబీలో వడగండ్ల వాళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.ఇప్పటికే చెరువులో నీరు 33 ఫీట్లు నీరు నిల్వ ఉన్నాయి ఈ సంవత్సరము సుమారు 6,500 ఎకరాల దాకా ఇచ్చే అవకాశం ఉన్నది. తైబంది ముందుగా ప్రకటిస్తే రైతులు అందుకు అనుగుణంగా రబీ సీజన్లో రైతులు పనులకు సిద్ధమవుతారని పేర్కొన్నారు అధికారులు వెంటనే లక్నవరం టైబంది వెంటనేప్రకటించాలని రంగాపురం, కోట, శ్రీరామ్ పతి కాలువల పూర్తి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గుండు రామస్వామి కాపకోటేశ్వరరావు సామ శ్రీనివాస్ రెడ్డి ఖ్యాతం సూర్యనారాయణ బానోతు మంక్తియా నాయక్ కన్నోజు సదానందం తదితరులు పాల్గొన్నారు
