* కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో జరుగు ధర్నా లను జయప్రదం చేయండి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ గోవిందరావుపేట
ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)
గోవిందరావుపేట మండలం పసరలో తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ సమావేశం గౌరారపు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మూడు శోభన్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎస్కేఎం పిలుపుమేరకు అన్ని జిల్లా కేంద్రాలలో నవంబర్ 26న నిరసన ప్రదర్శనలు ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేసి పార్లమెంట్లో రైతు మద్దతు ధర చట్టం తెస్తామని హామీ ఇచ్చి మూడేళ్లయిన మద్దతు ధర చట్టం పార్లమెంట్లో తెలియదని అంతే కాకుండా నూతన వ్యవసాయం ముసాయిదా చట్టం పేరుతో వ్యవసాయ మార్కెట్లను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు రైతులకు అంటగడుతుందని పేర్కొన్నారు ఈ రోజున ప్రతి కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా 7 కింటోళ్లు మాత్రమే నువ్వులు చేస్తారని పేర్కొంటున్నది మిగతా పత్తిని ఎవరు కొనుగోలు చేయాలి అంతేకాకుండా కపాస్ పేరుతో రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకొని
పత్తిని నమోదు చేసుకొని పత్తిని అమ్మాలని నిబంధన చేస్తే ఈరోజు ఏ రైతు నమోదు చేసుకుంటాడని అనేక మంది రైతులకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఈ యాప్ తెలవక ప్రైవేటు వ్యాపారస్తులకు అడ్డుకి పావు షేరుఅమ్మవాల్సి వస్తుందని అడ్డుకి పావు షేరు పేర్కొన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు కూడా అవలంబిస్తుందని 59 రకాల కార్మిక చట్టాలను చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలు అనుభవిస్తుందని ఉపాధి హామీ చట్టం నిధులను తగ్గించి వేసి ఆన్లైన్ పేరుతో అనేకమంది జాబ్ కార్డ్లను తీసివేసి కూలీలను తగ్గించి వేస్తుందని ఉపాధి హామీ పనులకు నిధులు కోత పెడుతుందని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కు వ్యతిరేకంగా సంస్కరణలు తీసుకువస్తూ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని దానికి నిరసనగా నవంబర్ 26న జిల్లా కేంద్రాలలో జరుగు కార్మికకర్ష క రైతు ప్రదర్శనను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైందని మిల్లర్స్ క్వింటాలుకు రెండు నుండి ఐదు కిలోలు కట్ చేస్తున్నారని పేర్కొన్నారు. అసలే అతివృష్టి వల్ల దిగుబడి తగ్గి ఎకరాకు 10 క్వింటాలు నుండి 15 కిట్టాలు మాత్రమే దిగుబడి వస్తుందని దీంట్లో మిల్లర్స్ కట్ చేస్తే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి పడుతుందని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మొక్కజొన్న వేలాది ఎకరాలలోపండిస్తే ఈ రోజున దళారులు క్వింటాలుకు 1700 నుండి 1800 మాత్రమే కొనుగోలు చేస్తామని పేర్కొంటున్నారని క్వింటాలకు నాలుగు కిలోల తరుగు తీస్తున్నారని ప్రభుత్వం ములుగు జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా రైతులు పండించిన మొక్కజొన్న మొత్తం కొనుగోలు చేయాలని దళారి వ్యవస్థ ను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి,గుండు రామస్వామి, కాపకోటేశ్వరరావు, ఊకే నాగేశ్వరరావు, ఊకె ప్రభాకర్,సామ శ్రీనివాస్ రెడ్డి, అల్లెం అశోక్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు
