పోలీసుల వైఫల్యంతోనే ఎర్ర రాజశేఖర్ హత్య
కుల అహంకార ధోరణితో జరిగిన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎర్ర రాజశేఖర్ హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
రాజశేఖర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, ఉద్యోగం, సొంత ఇల్లు ఇవ్వాలి
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ సీనియర్ నేత వై. రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎల్లంపల్లిలోని ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ శ్రేణులు
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 24:పోలీసుల వైఫల్యంతోనే ఎర్ర రాజశేఖర్ హత్య సంఘటన చోటుచేసుకుందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత వై. రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో హత్య కు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడారు. కేవలం కుల అహంకార ధోరణితో ఎర్ర రాజశేఖర్ హత్య ఘటన చోటు చేసుకుందని, కులాంతర వ్యవహారాలకు ప్రత్యేక చట్టాలను అమలు చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రేమ వివాహా నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని తెలిసిన పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం బాధాకరమన్నారు. నిందితులు ప్రణాళిక ప్రకారం ఎర్ర రాజశేఖర్ ను హత్య చేశారని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు. ప్రజల కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం సొంత ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యంతో హత్యా సంఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని, ఆయననే రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్నారనే విషయాన్ని గ్రహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మరో మరో ఈ తరహా సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలు చేసుకోవచ్చని చట్టాలు ప్రభుత్వాలు చెబుతున్న ఆ దిశగా ప్రజలు ఆలోచించడం లేదని వాపోయారు. ఏది ఏమైనా ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ నాయకులు నటరాజ్, లక్ష్మణ్ నాయక్, సత్యనారాయణ, పెంటనోళ్ళ యాదగిరి తదితరులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
