ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన మందకృష్ణ మాదిగ 

On
ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన మందకృష్ణ మాదిగ 

930816b5-b23b-4137-85ec-e17de5b64c86

 ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ

 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఇటీవల దళితుడు ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు గురైన సందర్భంగా సోమవారం ఎర్ర రాజశేఖర్ దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన మంద కృష్ణ మాదిగ ఈ సందర్భంగా ఎర్ర రాజశేఖర్ సతీమణి ఎర్రవాణి, అతడి తండ్రి ఎర్ర మల్లేష్ తదితరు కుటుంబ సభ్యులను మందకృష్ణ మాదిగ  పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు దారి తీసిన విషయాలను వారి నుండి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక మీడియాతో మందకృష్ణ మాదిగ మాట్లాడారు.హిందువులు పూజించే శ్రీకృష్ణుడు, యాదవులకు ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడు ఆనాడు తమ జాతికి చెందిన జాంబవంతుడు కుమార్తె జాంబవతిని వివాహమాడారని ఆయనకు లేని కుల వివక్ష ఇక్కడ యాదవులకు ఎందుకని ? మందకృష్ణ మాదిగ అన్నారు. ఎల్లంపల్లి గ్రామంలో దళితుడు ఎర్ర రాజశేఖర్ సోదరుడు యాదవ యువతిని ప్రేమించిన కారణంగా ఆ యువతి తండ్రి వెంకటేష్ ఒక యాదవుడని అతనికి తమ దైవం శ్రీకృష్ణ భగవానుడు గురించి తీయలేదని ప్రశ్నించారు. భగవంతుడే కులాలను విశ్వసించకుండా వివాహమాడినప్పుడు అప్పుడు యాదవ వంశ పెద్దలకు లేని వివక్ష ఇక్కడ సమాజంలో కుల వివక్ష ఎందుకు వచ్చిందని ఘాటుగా ప్రశ్నించారు. సమాజంలో పెట్రేగిపోతున్న కుల వివక్షను రూపుమాపడానికి హిందూ ధర్మ రక్షకులు, సనాతన ధర్మాన్ని కాపాడే వారు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భగవంతుడు సమాజంలో కుల మతాలకు అతీతంగా అందరిని సమానంగా చూడమని బోధించాడని మరి హిందూమతంలోని ఇలాంటి వివక్షలు పెరిగి చంపేందుకు కారణం అవుతుంటే వీటిపై మాట్లాడడానికి హిందూ ధర్మ రక్షకులు ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందని సూచించారు. కుల వివక్ష కరోనా కంటే ప్రమాదకరమైనదని, కరోనా ను రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఆ మహమ్మారిని పారద్రోలు ఎందుకు ఇలాంటి ప్రచార చర్యలు తీసుకున్నారు ప్రత్యేక నిధులు కేటాయించారు కుల వివక్షను కూడా రూపుమాపేందుకు అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల వివక్ష వెంటనే పోదని కాకపోతే రాబోయే భవిష్యత్తులో కచ్చితంగా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు. అతడు ఎర్ర రాజశేఖర్ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. అయితే వారికి తొందరగా బెయిల్ రాకుండా జాగ్రత్తలు పోలీసులు తీసుకోవాలని సూచించారు. నిందితులు జైల్లో ఉన్నప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి శిక్ష పడే విధంగా ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.  ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కమిషన్ వెంటనే స్పందించి రాజశేఖర్ కుటుంబానికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇల్లు ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా పోలీసు శాఖ అధికారులతో పాటు స్థానిక ఆర్డిఓ, ఎమ్మార్వో సరితతో ఫోన్లో మాట్లాడి బాధితులకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సహకారాన్ని అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మిగతా హత్య కేసులతో పార్టీ ఈ కేసును ప్రభుత్వం చూడకూడదని పరోహత్యను ప్రత్యేకంగా చూసి ఇందులో కఠినతరమైన చట్టాలను అమలు చేసి బాధితులకు శిక్ష పడితేనే సమాజంలో మార్పు వస్తుందని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.
దేశంలో జరుగుతున్న మతాల ఘర్షణలో చనిపోయే వారి సంఖ్య అదే విధంగా రాజకీయ హత్యలు వీటన్నింటి కంటే కుల వివక్షతో జరిగే హత్యలే ఎక్కువగా ఉన్నాయని అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

Tags

Share On Social Media

Latest News

పోలీసుల వైఫల్యంతోనే  ఎర్ర రాజశేఖర్ హత్య పోలీసుల వైఫల్యంతోనే  ఎర్ర రాజశేఖర్ హత్య
    కుల అహంకార ధోరణితో జరిగిన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం  ఎర్ర రాజశేఖర్ హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి  రాజశేఖర్
రైతన్న మీకోసం కార్యక్రమం
ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన మందకృష్ణ మాదిగ 
గండిపేట లో నూతన ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ స్టేషన్ ప్రారంభం
* కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో జరుగు ధర్నా లను జయప్రదం చేయండి 
సిపిఎం తోనే గ్రామ అభివృద్ధి
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం

Advertise