ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం

On
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం

 

 డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్

నమస్తే భారత్:-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో ప్రజా ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్రంలోని మహిళలకు, ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళా సోదరీమణులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాలాలలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి ద్వారా పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి స్వయం ఉపాధి రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల తహసీల్దార్ కృష్ణవేణి, స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ఏపియం అలివేలు మంగ. ఎంపీఓ సోమలాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ యాదగిరి రెడ్డి, మాజీ సర్పంచ్ రాంలాల్, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise