సిఐటియు జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి
అత్తాపూర్ డివిజన్ కన్వీనర్ బచ్చలకూర స్వామి,
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 8, సిఐటియు జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని అత్తాపూర్ డివిజన్ కన్వీనర్ బచ్చలకూర స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శనివారం సీఐటీయూ రంగారెడ్డి జిల్లానాలుగవ మహాసభల వాల్పోస్టర్ అత్తాపూర్ డివిజన్ కన్వీనర్ బచ్చలకూర స్వామి నాయకులతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బచ్చలకూర స్వామి మాట్లాడుతూ సిఐటియు రంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభ రాజేంద్ర మండల్ కాటేదాన్ ప్రాంతంలో జరుగుతుందని నవంబర్ 10వ తేదీన బహిరంగ సభ నవంబర్ 11వ తేదీన మహాసభను జయప్రదం చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మాయ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అన్నారు. వెంటనే ఆరు గ్యారెంటీలు అమ్మల్లోకి తీసుకురావాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 44 చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మారుస్తున్న విధానాలను రద్దు చేయాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాగే కొనసాగితే కార్మికులకు ఉన్న హక్కులు పూర్తిగా పోతాయని, ఈ విధానాన్ని వెనక్కి తీసుకోని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసి తీర్మానాలు చేసి ఉద్యమాలకు సిద్ధమవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు లక్ష్మీరాణి,వీరమని, బుద్వేల్ యూనియన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి చంద్రశేఖర్ నర్సింగ్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
