సేవా భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం అన్ని రకాల సేవా కార్యక్రమాలు
అమ్మ ఆశ్రమం ఫౌండర్ గోపిరాజు
నమస్తే భరత్, రాజేంద్రనగర్, నవంబర్ 14, అమ్మ ఆశ్రమం సేవా భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆశ్రమం ఫౌండర్ గోపి రాజు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని శుక్రవారం అమ్మ ఆశ్రమంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా బోర్డు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అండే కంటే శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను ఈ కార్యక్రమంలో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో డాక్టర్ దివ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ ఆశ్రమం ఫౌండర్ గోపిరాజు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మ వృద్ధాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, పోటీ పరీక్షలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేస్తున్నామని వారు అన్నారు. సమాజంలో పిల్లలు వృద్ధిలోకి రావడానికి సేవా భారతి ఫౌండేషన్ తరపున ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. మీ చుట్టూ ఉన్న వృద్దులకు ఆసరా అవసరమైన వృద్ధులకు 966615011 నెంబర్ కి ఫోన్ చేసి ఆశ్రమంలో చేర్పించవచ్చు అని తెలిపారు.
