#CYBERABAD | డ్రోన్ షార్ట్సలో స్వర్గం..రియాలిటీలో నరకం
ట్రాఫిక్ జాముతో వర్ణతీతంగా మారిన ఉద్యోగులు, వాహనదారుల పరిస్థితి
డ్రోన్ షార్ట్సలో అందంగా..మిలమిలా మెరిసే విద్యుత్ కాంతులతో స్వర్గాన్ని తలిపించే సైబర్ సిటీ, గ్రౌండ్ రియాల్టీ మరోలా ఉంది. అది నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకానికి తలిపించేలా తయారయ్యింది. అధికారులు ఎన్ని స్ట్రేటజీలు తయారు చేసిన ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఆచరణలో పనిచేయడం లేదని చెప్పుకోవాలి.
నగరంలో భారీ పెట్టుబడులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గూగుల్, మెట, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, మోర్గాన్, అమెజాన్ తో పాటు ఫైనాన్స్, ఫార్మా, ఈ-కామర్స్, సైబర్ సెక్యురిటి, సోషల్ మీడియా, నిర్మాణ సంస్థల కార్పొరేట్ కార్యాలయాలు, ఆన్ సైట్ డెవలపర్స్ కంపెనీలు వేలల్లో సైబరాబాదులో స్థిరబడ్డాయి. అందులో లక్షల్లో ఉద్యోగులు ఉన్నారు.
ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు జీహెచ్ఎంసి, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 365 రోజులు 24 గంటలు 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. దింతో లక్షల్లో ఉద్యోగులు ఒకేసారి క్యాబులు, సొంత వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్-పోర్ట్ సహాయంతో ఉద్యోగరీత్యా బయటకు వస్తున్నారు.
ఈ కారణంగా జెఎన్టియు, కెపిహెచ్బి, కూకట్ పల్లి, బాలానగర్, కైతలపూర్, ఫోరమ్ మాల్, బచూపల్లి, నిజాంపేట్, మియాపూర్, ప్రగతి నగర్, గాజులరామరం, హైటెక్ x రోడ్, కొండాపూర్, గచ్చిబౌలి, మైండ్స్ స్పేస్, రహేజా ఐటీ పార్క్, IKEA, INORBIT, హైటెక్స్, శేరిలింగంపల్లి, వద్ద పెద్ద ఎత్తున్న ట్రాఫిక్ జామ్ అవుతుంది. నత్త నడక వేగంతో బండ్లు ముందుకు సాంగుతుండడంతో గంటల తరుబడి రోడ్ల పై వాహనాలు నిల్చిపోతున్నాయి. దింతో వాహనాలు సైతం వేడెక్కి నడిరోడ్డు పై ట్రబుల్ ఇస్తుదండంతో వెహికల్ ఓనర్స్ తలలు పట్టుకుంటున్నారు.
బయటికి వచ్చాము అంటే తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఎంత సమయం పడుతుందో తెలియదని ఉద్యోగులు మండిపడుతున్నరు. ఒక వైపు గుంతలు పడ్డ రోడ్లు, మరో వైపు ఇరుకైన రోడ్లతో ఇక్కట్లు తప్పట్లేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. సరైన ప్లానింగ్ లేకుండా మెట్రో, సముదాయా నిర్మాణలు నిర్మించడంతో ఈట్రాఫిక్ సమస్య తలెతుందని నిపుణులు ఆరోపించారు. రానున్న రోజుల్లో సమస్య తీవ్రతా మరింత పెరగనుందని ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ జోశ్యం చెప్పరు. భవిష్యత్తులో వంద అడుగుల రోడ్డు నిర్మించిన ప్రయోజనం లేదని ప్రజలు తెలుపుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు : JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ | RSS శతాబ్ది ఉత్సవాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్ ఆరోగ్యానికి హానికరం
రానున్న రోజుల్లో భారత రాజధాని ఢిల్లీలో అవిలంభిస్తున్న ఆడ్-ఈవెన్ ఫార్ములా హైదరాబాదులో ప్రయోగించడం తప్పదు అనే విదంగా ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది, సైబరాబాద్ పరిధిలో ఉన్న సంస్థలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రామ్ హోమ్ పనులు చేయిస్తే కొద్దిపాటి సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. రోడ్ల ఇరువైపులా అక్రమాలను తొలిగించి రోడ్డు వెడల్పు పనులు చెయ్యాలని, అవసరమైన చోట ఫ్లై ఓవర్లు నిర్మించాలని ట్రాఫిక్ ఇబ్బందులకు స్వస్తి పలకాలని ప్రజలు కోరుతున్నారు.
Publisher
Namasthe Bharat