అంటూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ప్రిన్సిపాల్ డాక్టర్ సంగి రమేష్.
మహేశ్వరం, డిసెంబర్ 1, నమస్తే భారత్ న్యూస్ ప్రతినిధి:
అంటూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సంగి రమేష్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ కళాశాల మహేశ్వరం లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని చేతులు కలపడం ద్వారానో భోజనం తినడం కలిసి తినడం ద్వారానో అంటుకోదని ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారందరూ అనేక రకాల అవమానాలు మాటల వలన గాయపడుతున్నారని ఆయన చెప్పారు. మంచి మందుల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణ ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ఎయిడ్స్ 2025 ప్రకారం యువత ద్వారా మరింత ఎక్కువ అవగాహన కార్యక్రమాలు జరగాలని డ్రగ్స్ ద్వారా,అనైతిక సంబంధాల ద్వారా వ్యాపించే ఎయిడ్స్ ను అరికట్టాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారిని డాక్టర్ జహీదా బేగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఎయిడ్స్ కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞను చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ ఉపేందర్,శ్రీదేవి, డాక్టర్ ఫర్హాద్, నరేందర్ రెడ్డి, చిన్నజీ, ప్రవళిక కుమార్, సునీత,సన్నీ తదితరులు పాల్గొన్నారు.
