ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడమే లక్ష్యం : చైతన్య రాజు

On
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడమే లక్ష్యం : చైతన్య రాజు

 
 నమస్తే భారత్ , పోడూరు, డిసెంబర్ 03: క్యాన్సర్ వ్యాధులను ముందుగానే గుర్తించి ప్రాణాంతక వ్యాధులను నియంత్రించి ఆరోగ్యవంతమైన సమాజం కోసమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని కిమ్స్, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు ( చైతన్య రాజు ) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా  పోడూరు జమ్ము చెట్టు, క్షత్రియ భవనంలో బుధవారం ఎడాప్ట్  ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పందేటి భూపతిరాజు ఆర్థిక సౌజన్యంతో గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్, అమలాపురం కిమ్స్ ఆసుపత్రి, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ డా లక్ష్మీ దీప్తి మెడికల్ అంకలజిస్ట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన శిబిరం నిర్వహిస్తున్నారు. శిబిరాన్ని చైతన్య విద్యాసంస్థల చైర్మన్ అమలాపురం కిమ్స్ ఆసుపత్రి, మెడ్డికినైటెడ్ ఆసుపత్రుల మరియు గైట్ గ్లోబల్ యూనివర్సిటీ అధినేత  కెవివి సత్యనారాయణ రాజు ప్రారంభించారు.
శిబిరంలో వైద్య బృందాలు మహిళలకు వచ్చే సర్వికల్, రొమ్ము క్యాన్సర్లు, అలాగే పురుషులకు వచ్చేనోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లను 220 మందికి ఆధునిక పరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా చైతన్య రాజు మాట్లాడుతూ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడానికి క్యాన్సర్ ముందుగా గుర్తించటానికి ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాలలో క్యాన్సర్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని, ఇది ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఖరీదైన పరీక్షలను ఉచితంగా అందించడం ఆత్మస్రంతప్పిని కలిగిస్తుంది అన్నారు. పేదలు ఈ పరీక్షలను చేయించుకోలేక వ్యాధి తీవ్రతతో ప్రాణాంతకంగా మారుతుందని, ముందుగా గుర్తించడంతో సకాలంలో వైద్యాన్ని పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచి చెట్టు బత్తుల సువర్ణ రాజు, గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ కన్వీనర్ రుద్రరాజు రమేష్ రాజు, మాజీ సర్పంచి రుద్రరాజు సుజాత, వైసిపి నాయకులు రుద్రరాజు శివాజీ రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీ వాసవి సుప్రజ, గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise