సర్పంచులు,పార్టీ నాయకులను వేధిస్తే సహించేది లేదు: శ్రీ రంగనాథరాజు

On
సర్పంచులు,పార్టీ నాయకులను వేధిస్తే సహించేది లేదు: శ్రీ రంగనాథరాజు

 

 నమస్తే భారత్, పోడూరు డిసెంబర్ 3 :

ఆచంట నియోజకవర్గంలో గ్రామ సర్పంచులను, పార్టీ నాయకులను, కార్యకర్తలను అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ దుశ్చర్యలను సహించేది లేదని మాజీమంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు హెచ్చరించారు.బుధవారం తూర్పుపాలెం వైసీపీ కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆచంట నియోజవర్గంలో  సర్పంచలపైన, వైసీపీ నాయకులపైన అనేక రకాలుగా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఇటువంటి అనాలోచిత ఆరోపణలతో సర్పంచలపై వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు, గత ఆచంట సర్పంచిపై రెండు కోట్ల 50 లక్షలు అవినీతి ఆరోపణ వస్తే ఇప్పటివరకు రికవరీ లేదన్నారు. తక్షణమే ఆ సొమ్మును రికవరీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఆచంట నియోజకవర్గంలో వైసీపీ నాయకుల పై స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇటువంటి దురగతాలకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోనే జరుగుతుందని తెలిపారు.మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నియోజకవర్గంలో ఈ నెల ఏడో తారీకు లోపుగా ప్రతి ఒక్కరూ నియోజవర్గంలోని ఇన్చార్జిలు గ్రామాలకు వెళ్లి లక్ష్మీ మేరకు సంతకాలను పూర్తి చేసి అందించాలని ఆయన తెలియజేశారు. ఈనెల 10వ తారీఖున జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయనున్నట్లు నియోజవర్గం నుంచి 60 వేల సంతకాల సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు జడ్పీ ప్రతి పక్షనేత గుంటూరి పెద్దిరాజు, ఎంపిపి కర్రి వాసురెడ్డి, కర్రీ వేణుబాబు, వైసీపీ ఎస్సి జిల్లా అధ్యక్షులు చిన్నం ఏడుకొండలు,
వైసీపీ నాయకులు దంపబోయిన బాబారావు, సుంకర సీతారామ్, కోట సరోజినీ వెంకటేశ్వరరావు,మట్టా రాము కుమారి, జక్కంశెట్టి చంటి, నల్లిమెల్లి బాబీ రెడ్డి.గుడాల దేవేంద్రుడు,పిల్లి నాగన్న, చిటికిన బాబీ, కొవ్వూరి చిన్నా రెడ్డి 
సూర్య రెడ్డి, నారాయణరెడ్డి, పోతుమూడి రామచంద్ర రావు, చింతపల్లి గురుప్రసాద్,దొంగ దుర్గాప్రసాద్, బుర్ర రవికుమార్, చిన్నారెడ్డి, బ్రహ్మేశ్వర్ రెడ్డి నాగరాజు,పడాల అబ్బురెడ్డి,కోటే శశి మధు 
కోట గిరిధర్, పెచ్చెట్టి సత్యనారాయణ, పిల్లి రుద్ర ప్రసాద్, ముత్యాల నాగేశ్వరరావు, 
ముప్పాల వెంకటేశ్వరరావు, కుక్కల సూరిబాబు, జక్కంచెట్టి రఘునందన్, గుబ్బల వీరబ్రహ్మం, గుడాల చంటి, గొట్టుముక్కల రమేష్, పురెళ్ళ శ్రీను, గణపతి పదివేల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise