కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ లుగా ఎన్నుకోవాలి

On
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ లుగా ఎన్నుకోవాలి

 

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిశగా ప్రభుత్వం ముందుకు 

తెలంగాణ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్

రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల సిద్ధేశ్వర్ 

 నమస్తే భారత్ , రాజేంద్రనగర్, డిసెంబర్ 03, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలంగాణ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల సిద్ధేశ్వర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం మీడియా సమావేశంలో రాచమల్ల సిద్దేశ్వర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవాలని రాచమల్ల సిద్దేశ్వర్ కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందున కాంగ్రెస్ సర్పంచులు గెలిస్తే గ్రామాలు ఇంకా బాగుపడతాయని అన్నారు. రా ష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజాపాలన పేరుతో ప్రజల ఇంటికే ప్రభుత్వ సేవలు చేరే విధంగా పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాదును మరియు తెలంగాణను దేశవ్యాప్తంగా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.గత 10 సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో సర్పంచుల 
ద్వారా పనులు చేయించి వారికి బిల్లులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. గత ప్రభుత్వం బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని అన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన సమయంలో ఒక పేదవారికి కూడా స్వంత ఇల్లు అందేలా చేయలేకపోయిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో దాదాపు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి, పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. అంతే కాకుండా సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు తదితర సంక్షేమ పథకాల తో పేద వారికి కూడు గూడు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.ఆర్ధికంగా బలహీనమైన రాష్ట్రాన్ని తిరిగి పటిష్టం చేస్తున్న ప్రభుత్వం రైతు రుణమాఫీ, వడ్లకు బోనస్, ఉద్యోగాల భర్తీ వంటి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని చెప్పారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం నాసిరకం చీరలు పంచగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని రాచమల్ల సిద్దేశ్వర్ అన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise